Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీరియస్ షిట్: వర్థమాన నటి వ్యాఖ్యలపై తీవ్రదుమారం

ఒక అంతర్జాతీయ స్థాయి సీరియల్ షో పరిచయ కార్యక్రమం మాత్రమే తెలుగులో మొదలైంది. అప్పుడే దానిపై తీవ్రమైన విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు, బిగ్ బాస్ హోస్ట్ జూనియర్ ఎంటీఆర్‌పై చెణుకులు.. ఎందుకిలా జరుగుతోంది? ఇంగ్లీషులోనూ, హిందీలోనూ జరిగిన విధంగా కాకుండా పెద్ద స

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (03:50 IST)
ఒక అంతర్జాతీయ స్థాయి సీరియల్ షో పరిచయ కార్యక్రమం మాత్రమే తెలుగులో మొదలైంది. అప్పుడే దానిపై తీవ్రమైన విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు, బిగ్ బాస్ హోస్ట్ జూనియర్ ఎంటీఆర్‌పై చెణుకులు.. ఎందుకిలా జరుగుతోంది? ఇంగ్లీషులోనూ, హిందీలోనూ జరిగిన విధంగా కాకుండా పెద్ద సెలబ్రిటీల జోలికి పోకుండా సహాయ నటులు, గాయనిలు, సినీరంగ విమర్సకులు వంటి సాధారణమైన వ్యక్తులను పనిగట్టుకుని ఎందుకు బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకుని షో చేయాలనే ధైర్యానికి దిగారు అనేది నిర్వాహకులు చెబితే గానీ ఎవరికీ తెలియదు. మరి ఈ ప్రోగ్రం తెలుగు వెర్షన్ ఉద్దేశం ఇంకా బోధపడకుండానే ఇది ఫెయిల్ అని, దీన్ని చూడటం కంటే ప్లగ్ లో వెలుపెడితే మంచిదని వ్యాఖ్యలు చేయడంలో ఏదో పక్షపాతం పొడసూపుతున్నట్లు కనిపించడం లేదా.. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సిద్దమై వచ్చిన వారి ప్రదర్సన ఒక్క షో కూడా చూడకుండానే అప్పుడే కామెంట్లు మొదలెట్టడం న్యాయం కాదని కొందరి వ్యాఖ్య
 
ఈలోపల యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ షోపై వర్ధమాన నటి మానస హిమవర్ష ఫేస్‌బుక్‌లో ఒకింత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షోలో తను భాగం కాకపోవడం ఆనందం కలిగిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. 'సీరియస్ షిట్‌' అంటూ ఆమె బిగ్‌బాస్‌ షో తొలి ఎపిసోడ్‌ పూర్తయిన తర్వాత ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ 'కాటమరాయుడు'లో శివబాలాజీ సరసన, దర్శకుడు వంశీ 'ఫ్యాషన్‌ డిజైనర్‌'లో నటించిన ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. 
 
ఎన్టీఆర్‌ అభిమానులు ఆమెను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. అయితే, తన పోస్టును సమర్థించుకున్న ఆమె తాను ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానినని తెలిపారు. 'ఆయన డ్యాన్స్‌ అద్భుతంగా ఉంటుంది. ఇది ఆయన పనిని పరిహసించడం  కాదు' అని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ షోపై తన పోస్టును తొలగించే ప్రసక్తి లేదన్న ఆమె.. ఎన్టీఆర్‌ను కించపరిచిందంటూ తన పోస్టును వక్రీకరించొద్దంటూ సూచించారు.
 
విమర్శించడం లేదంటూనే బిగ్‌బాస్‌ షోలో తను భాగం కాకపోవడం ఆనందం కలిగిస్తున్నదని పేర్కొనడంలో మతలబు ఏమిటో మరి. ఆమెను ఈ కార్యక్రమంలోకి తీసుకోలేదని బాధతో, ఈర్ష్యతో అంటోందని ఎవరైనా అంటే ఎలాగుంటుంది. సెలెబ్రటీలు తప్పితే సగటు మనుషులు భారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అర్హులు కారా.. ఇదేదో వివక్షకు సంబందించిన విషయంలా మారేటట్టుంది. షో మొదలయ్యాక రెండు మూడు వారాలు గడిస్తే అప్పుడు దానిపై ఒక అభిప్రాయానికి రావడమే సమంజసం కాదా..
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments