రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (11:35 IST)
ఇటీవలికాలంలో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సినీ నట కల్పిక తాగా మరోమారు వివాదంలో చిక్కుకుంది. నగర శివారులోని ఓ రిసార్టులోనూ ఆమె హంగామా సృష్టించారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్ మండలం కనకమామిడి రెవెన్యూలోని బ్రౌన్ టౌన్ రిసార్టుకు సోమవారం మధ్యాహ్నం వచ్చిన ఆమె ఓ గదిలోకి వెళ్లి భోజనం చేశారు. 
 
ఆ తర్వాత సాయంత్రం వరకు అక్కడే ఉన్న ఆమె... పొద్దుపోయిన తర్వాత సిగరెట్లు కావాలంటూ రిసెప్షన్ సిబ్బందిని కోరింది. సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రిసెప్షన్‌కు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనేజరు కృష్ణపై చిందులు వేసింది. గదిలో వైఫై లేదు.. ఇతరత్రా సౌకర్యాలు లేవు. కనీసం సిగరెట్లు తెచ్చివ్వమంటే తేలేదంటూ హంగామా చేసింది. 
 
ఇక్కడ ఉండలేనంటూ గది తాళాలను విసిరేసింది. గంటపాటు హంగామా చేసి నగరానికి వెళ్లిపోయింది. తన పట్ల రిసార్టు సిబ్బంది అసభ్యంగా వ్యవహరించారంటూ మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేసింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments