Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ సన్నాసి దోమలు, కుట్టి చంపుతున్నాయి, ఒకే గదిలో హీరోయిన్లు రాగిణి - సంజన

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (13:35 IST)
డ్రగ్స్ దందాలో అరెస్టు అయిన కన్నడ హీరోయిన్లు రాణిగి ద్వివేది. సంజనా గల్రానీలు. వీరిద్దరినీ జైలు అధికారులు ఒకే గదిలో ఉంచారు. అయినప్పటికీ.. వారిద్దరూ మాట్లాడుకోకుండా ముభావంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వీరున్న బ్యారక్‌లో దోమలు విపరీతంగా ఉండటంతో జైలు అధికారులతో సంజనా గల్రానీ గొడవకు దిగింది. అయినప్పటికీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. 
 
కాగా, డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఈ ఇద్దరు హీరోయిన్లను ప్రస్తుతం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. అయితే, నటి సంజన గల్రానీకి ఇంటి ఆహారాన్ని అందించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. 
 
మరో నటి రాగిణి ద్వివేదితో కలిసి ఒకే బ్యారక్‌లో ఉంటున్న సంజనను కలిసి ఆహారం, దుస్తులు అందించేందుకు ఆమె తల్లిదండ్రులు మనోహర్, రేష్మా గల్రానీలు గురువారం జైలు వద్దకు వెళ్లారు. వారి నుంచి దుస్తులను మాత్రమే తీసుకున్న అధికారులు వెంట తెచ్చిన ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను తీసుకునేందుకు నిరాకరించి తిరిగి వారికే ఇచ్చేశారు.
 
వీరిద్దరూ ఒకే బ్యారక్‌లో ఉన్నప్పటికీ తమ వెంట తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ ఇద్దరూ కాలక్షేపం చేస్తున్నారు. బ్యారక్ బయట తిరిగే అవకాశం ఉన్నప్పటికీ వారిద్దరూ గదిని విడిచి బయటకు రావడం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు, రాగిణి, సంజన ఇద్దరికీ జైలు అధికారులు ఇతర ఖైదీలకు అందించే సాధారణ ఆహారాన్నే ఇచ్చారు.
 
ఇదిలావుండగా, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంజనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, తన బ్యారక్‌లో దోమలు విపరీతంగా ఉన్నాయని, వాటి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదంటూ సంజన జైలు అధికారులతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments