Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు 'స్పాట్‌'లు చూపించకుండా నటించా... రాద్దాంతం వద్దు : 'న్యూడ్‌'పై సంజన వివరణ

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో 'దండుపాళ్యం 2' సినిమాకు సంబంధించిన న్యూడ్ సీన్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో రియాల్టీ కోసం ఓ సీన్‌లో కన్నడ నటి సంజనను నగ్నంగా చిత్రీకరించారని, ఆ వీడియో ఇదేనంటూ నెట్‌లో

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (14:03 IST)
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో 'దండుపాళ్యం 2' సినిమాకు సంబంధించిన న్యూడ్ సీన్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో రియాల్టీ కోసం ఓ సీన్‌లో కన్నడ నటి సంజనను నగ్నంగా చిత్రీకరించారని, ఆ వీడియో ఇదేనంటూ నెట్‌లో ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర నిర్మాత, దర్శకుడు లేదా చిత్ర యూనిట్ గానీ ఎక్కడా స్పందించలేదు.
 
కానీ, నటి సంజన మాత్రం స్పందించారు. ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. హాఫ్ న్యూడ్‌గా మాత్రమే నటించానని, ముఖ్యంగా ఆ రెండు స్పాట్‌లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని కెమెరా ముందు నటించినట్టు తెలిపారు. అంతేకానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్తి నగ్నంగా నటించలేదని స్పష్టం చేసింది. ఇదే విషయంపై ఆమె తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో ఓ పోస్ట్‌ను చేసింది.
 
"జేమ్స్‌బాండ్ సినిమా అయినా సరే నేను 100 శాతం నగ్నంగా నటించడానికి అంగీకరించను. నెట్‌లో వైరల్ అవుతోన్న వీడియో మార్ఫింగ్ చేసింది. ఓ నటిగా నా పాత్రకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే, అదే సందర్భంలో సాంప్రదాయాలను, విలువలను, నా ఆత్మగౌరవాన్ని, స్త్రీవాదాన్ని గౌరవించాలన్న బాధ్యతను కూడా దృష్టిలో ఉంచుకుంటాను. షూటింగ్ సమయంలో గ్లామరస్‌ షార్ట్ స్కర్ట్, వెస్ట్రన్ బ్యాక్‌లెస్ టాప్‌ను మన దేశంలో ఉన్న 95 శాతం మంది హీరోయిన్లు ధరిస్తున్నారు. అంతమంది ముందు అలాంటి దుస్తులు ధరించడం సాహసమే.. అయినప్పటికీ సినిమాకు మంచి చేస్తోందనే ఉద్దేశంతోనే అలా నటిస్తాం.
 
దండుపాళ్యం2 సినిమాలో చంద్రి అనే నా పాత్రపై ఎంతో మంది సానుభూతి చూపిస్తున్నారు. కానీ, నెట్‌లో వైరల్ అవుతోన్న వీడియో చూసి, నాపై సానుభూతి చూపుతున్న విషయం తెలిసి షాకయ్యాను. కేవలం శరీరంపై దుస్తులను మార్ఫింగ్ చేయడమే కాదు... మొత్తం వీడియోనే మార్ఫింగ్ చేశారు. ఇది నిజంగా నా క్యారెక్టర్‌ను దిగజార్చడమే. ఇలాంటి పబ్లిసిటీ నా జీవితానికి అక్కర్లేదు. 
 
ఈ సీన్ సినిమాలో ఉందన్న సంగతి నాకు తెలుసు. ఈ సీన్‌ను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. కానీ, ఈ వీడియోను సోషల్ మీడియాలో నియంత్రించలేని విధంగా ఎవరు వైరల్ చేశారో నాకు తెలియడం లేదు. ఈ వీడియో సినిమాకు ఎలాంటి మంచి చేయదు. ప్రేక్షకులు ఈ సీన్ కోసమే సినిమాకు వెళ్లరు. సినిమా కథ నచ్చితే వెళతారు. సినిమాలో ఈ సీన్ లేదు. ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో నాకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నాదో అభ్యర్థన. అందరూ దయచేసి మీ సోషల్ మీడియాలో ఈ వీడియో ఉంటే తొలగించగలరని ఆశిస్తున్నాను అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం