'హరిహర వీరమల్లు' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆ చిత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఆ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ నగరంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో నిధి అగర్వాల్ పాల్గొని మాట్లాడుతూ, పవన్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనను సినిమాలో చాలా అందంగా చూపించారని, సినిమా అందరినీ ఆకట్టుకునేలా జ్యోతి కృష్ణ తీర్చిదిద్దారని, సినిమా రివ్యూస్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను సినిమాల్లోకి రాకముందు రత్నంతో వర్క్ చేయాలని అనుకునేవాడని. ఈ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ రత్నం తపన చూసి .. నేను రాజకీయాల్లోకి వెళ్లినా.. నా బెస్ట్ ఈ సినిమా కోసం ఇచ్చాను. క్లైమాక్స్‌కే 56 రోజులు పని చేశాం. నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి. ఫస్ట్ పార్ట్‌కే ఇవే ఆయువుపట్టు. కోహినూర్ వ్రజం ట్రావెల్ నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ హై కాన్సెప్ట్‌తో ఈ సినిమాను నా వద్దకు పట్టుకొచ్చారు. కరోనా ఈ సినిమాపై బాగా ఎఫెక్ట్ చూపింది. రత్నం నాకు ఖుషి టైమ్‌లో ఎంతో సౌకర్యం ఇచ్చారు.
అలాంటి రత్నం నలిగిపొతుంటే బాధ కలిగింది. వారు వెంట నిలబడాలనుకున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాలు, ప్రొఫెషనల్ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌కు దూరమైనా క్రిష్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు నీరసం వచ్చినా, ఈ సినిమాకు ప్రాణ వాయువు ఇచ్చిన వ్యక్తి కీరవాణి. నిర్మాతలు కనుమరుగు అవ్వకూడదని.. నా బిజీ షెడ్యూల్ ఉన్నా.. నా ప్రత్యర్థులు తిడుతున్నా.. నాకు అన్నం పెట్టిన సినిమా కోసం నేను చేశాను. ఈ సినిమాను ఛాలెజింగ్ కండీషన్స్‌లో రత్నం పూర్తి చేశారు. నా భుజాల మీదకి తీసుకుని పనిచేశాను. మిగతా హీరోలతో కంపైర్ చెస్తే నా సినిమాలకు బిజినెస్ తక్కువే. మనకున్న హీరోల్లో నేనొకడిని అని ఫీలవుతాను.
నిధి అగర్వాల్ సింగిల్ హ్యండెడ్‌గా ప్రమోషన్స్ చేస్తుంటే నాకే సిగ్గేసింది. అందుకే నేను ఉన్నానని చెప్పటానికే ఈ ప్రెస్మీట్ పెట్టాను. మా ప్రభుత్వం రాగానే చిత్ర పరిశ్రమను సాదరంగా అక్కున చేర్చుకుంది. అలాంటిది నా సినిమాను నేను ఎందుకు వదిలేస్తాను..? రత్నం మౌనం మంచితనమే నన్ను ఈ రోజు మీ దగ్గరికీ ఇలా నిలబెట్టింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కులమత ప్రాంత విభేదాలు లేవు. టాలెంట్ మీద నడుస్తుంది. చిరంజీవి తమ్ముడైన టాలెంట్ లేకుంటే నేను ఉండను. నా కొడుకు నిలబడడు. రత్నం మంచి సినిమా చేశారు.
ఈ రోజు మాత్రం వారు పడ్డ కష్టం కోసం ఖచ్చితంగా మాట్లాడాలి. కాస్టింగ్ కోసం రత్నం క్రిష్ బాగా వర్క్ చేశారు. ఔరంగజేబు పాత్రలో ముందు ఒకరిని నటింపచేసి, తర్వాత బాబీ డియోల్ వచ్చారు. ఈ సినిమాను పూర్తి చేయటానికి నా సమయానికి తగ్గట్టు, నా కంఫర్ట్‌కు తగ్గట్టు వర్క్ చేసి కంప్లీట్ చేశారు. జ్యోతి కృష్ణ సత్తా ఉన్న దర్శకుడు. మనోజ్ పరమహంస సపోర్ట్‌తో రత్నం అనుభవంతో హరిహర వీరమల్లు బాగా వచ్చింది. దీని రిజల్ట్ మాత్రం ప్రజల చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.