Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో రాణించాలంటే.. పదవులు కావాలంటే.. అది వుండాలి? (video)

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:35 IST)
ప్రస్తుత రాజకీయాలపై సినీ నటి మాధవీ లత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. భారత్‌లో రాజకీయాల్లో రాణించాలంటే.. పదవులు రావాలంటే అది కంపల్సరీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. గత కొంతకాలంగా మాధవీలతా, సాధినేని యామినేని మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో.. బీజేపీ మహిళా నేత, హీరోయిన్ మాధవీలత మరోసారి పెద్ద బాంబ్ పేల్చేసింది. 
 
నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఇండియాలో పదవులు రావాలంటే ఏం కావాలి? ఎలా ఉండాలో చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈసారి పదవులు రావడం కోసం అంటూ మాధవీ చేసిన కామెంట్స్‌కి కారణం సాధినేని యామిని అని తెలుస్తోంది.
 
సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీకి వచ్చి ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కించుకోవడంతో మాధవీలత- సాధినేని యామిని మధ్య వైరం మొదలైంది. ఒకప్పుడు మల్లెపూలు నలిపే కథలు చెప్పి క్రేజ్ తెచ్చుకున్న వారికి పార్టీలో గుర్తింపు ఇవ్వడం సరైంది కాదంటూ కామెంట్స్ చేసింది. 
 
 
తాజాగా సాధినేని యామినిని వారణాశి కాశీ దేవస్థాన బోర్డ్‌లో దక్షిణాది తరుపున అధికార ప్రతినిధిగా నియమించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించాడు ఓ నెటిజన్. ఇన్నాళ్లు బీజేపీ పార్టీలో ఉన్న మాధవీలతను గుర్తించకుండా.. టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన సాధినేని యామినికి పదవి కట్టబెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చూసిన మాధవీలత వెంటనే స్పందిస్తూ పొలిటీషియన్స్ అందరికీ దిమ్మతిరిగేలా ఇన్‌డైరెక్ట్ కౌంటర్ వేసింది.
 
ఇండియాలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదని, గొప్ప వాళ్లతో పరిచయాలు, రికమండేషన్స్ ఉంటే చాలంటూ మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక్క పాలిటిక్స్ మాత్రమే కాదు.. ఎక్కడైనా రికమండేషన్స్ అనేవి ఉంటాయని, తనను రికమండ్ చేసే గొప్పవాళ్లు ఎవ్వరూ లేరని, ఉందల్లా కేవలం అభిమానులే అంటూ జనాలను ఆలోచింపజేసే కామెంట్స్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments