Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్, నేను విడిపోవడానికి శ్రుతిహాసన్ కారణం కాదు: నటి గౌతమి

సినీ లెజెండ్ కమల్ హాసన్‌ను తాను దూరం కావడానికి కారణం యంగ్ హీరోయిన్, కమల్ కుమార్తె శ్రుతిహాసన్ కారణమంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. కమల్, తాను విడిపోయేందుకు శ్రుతిహాసన్ కారణం కాదని నటి గౌతమి త

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (09:05 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్‌ను తాను దూరం కావడానికి కారణం యంగ్ హీరోయిన్, కమల్ కుమార్తె శ్రుతిహాసన్ కారణమంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. కమల్, తాను విడిపోయేందుకు శ్రుతిహాసన్ కారణం కాదని నటి గౌతమి తెలిపింది. కమల్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని తానే నిర్ణయించుకున్నానని.. ఆ నిర్ణయానికి తానే బాధ్యత తీసుకుంటానని.. ఇందులో ఎవరి ప్రమేయం లేదని గౌతమి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 
 
శ్రుతిహాసన్‌కు 15ఏళ్ల వయస్సున్నప్పటి నుంచి తాను పెంచానని.. శ్రుతిహాసన్‌ కాలేజీ పూర్తయి.. మ్యూజిక్ కాలేజ్‌లో చేరే సమయంలో తనకు పరిచయం అయ్యిందని గౌతమి తెలిపింది. అప్పుడే తనకు కేన్సర్ ట్రీట్‌మెంట్ కూడా పూర్తయ్యిందని.. అప్పటికే 45 సైకిల్స్ ఆఫ్ రేడియేషన్స్ పూర్తయ్యాయి. ఆ తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నానని వెల్లడించింది. 
 
అలాంటి పరిస్థితుల్లో శ్రుతిహాసన్‌ను అమెరికాలోని మ్యూజిక్ కాలేజీలో చేర్పించేందుకు వెళ్లానని.. ఆ సమయంలో తనకు నడిచే ఓపిక లేకపోవడంతో చెన్నై ఎయిర్‌పోర్టుకి వీల్ ఛైర్లో వెళ్లానని తెలిపింది. అలా వెళ్లడం జీవితంలో తొలిసారి అని గౌతమి చెప్పింది. తనకు ఇష్టం లేని ఏ పనీ చేయనని..వృత్తి మీద ప్రేమ, అంకితభావం వుండాలని గౌతమి తెలిపింది. రాజకీయాలపై అవసరమైనపుడు మాట్లాడుతానని.. తన చుట్ట జరుగుతున్న విషయాలపై స్పందిస్తానని.. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా గళం విప్పి మాట్లాడుతానని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments