Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చెప్పిన‌ట్లు విన‌క‌పోతే ఓ పెద్ద నిర్మాత న‌లిపేస్తాన‌న్నాడు: చాందిని చౌద‌రి సెన్సేషనల్ కామెంట్‌

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (16:35 IST)
Chandini Chowdhury
తెలుగు సినిమారంగంలో ప‌ర భాషా న‌టీమ‌ణుల‌కు వున్నంత గౌర‌వం, మ‌ర్యాదలు తెలుగు న‌టికి లేద‌ని న‌టి చాందిని చౌద‌రి తేల్చిచెప్పింది. త‌ను య్యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్‌ చేస్తూ న‌టిగా గుర్తింపు పొందింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో చిన్న పాత్ర వేసింది. ఆ త‌ర్వాత ఆమెను ఓ పెద్ద నిర్మాత రెండేళ్ళు కాంట్రాక్ట్ రాసుకుని త‌న సినిమా చేయ‌డానికి బ్లాక్ చేశాడు. కానీ త‌ను సినిమా చేయ‌డు.


రోజూ రిహార్స‌ల్స్ అంటూ ఓ ద‌ర్శ‌కుడు, నిర్మాత వ‌చ్చేవారు. కానీ ఎంత‌కీ సినిమా తీయ‌క‌పోవ‌డంతో నేను తెగించి అడిగేశాను. అందుకు ఆయ‌న కోపంతో.. నేను చెప్పిన‌ట్లు విన‌క‌పోతే నిన్ను ఇండ‌స్ట్రీలో లేకుండా చేస్తాను. న‌లిపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో భ‌య‌మేసింది. ఇంట్లో కూడా పెద్ద‌వాళ్ళ‌తో గొడ‌వ వ‌ద్ద‌న్నారు.

 
కొంద‌రైతే ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు చెప్ప‌వ‌చ్చుగ‌దా అన్నారు. కానీ నేను తెలుగు అమ్మాయిని. నాకు స‌పోర్ట్‌లేదు. న‌న్ను తొక్కిప‌డేస్తే?  నా మీద అభాండాలు వేస్తే? అని ఆలోచించి సైలెంట్ అయ్యాను. ఆ రెండేళ్ళ‌లో పెద్ద సినిమాలు వ‌చ్చాయి. కానీ చేయ‌నివ్వ‌లేదు. వ‌దులుకున్నాను. ప‌టాస్ సినిమా నేను చేయాల్సింది అంటూ త‌న ఆవేద‌న‌ను అలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌లో వ్య‌క్తం చేసింది.


తెలుగు వారికి గౌరం లేదా! అని అడిగితే.. పైకిమాత్ర‌మే ఆ మాట‌లు. అస్స‌లు తెలుగు అమ్మాయి అంటే చుల‌న‌క‌గా చూస్తారంటూ చెప్పుకొచ్చింది. ఆ నిర్మాత ఎవ‌రు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడా! అని అడిగితే. ఆయ‌న ఇప్పుడు ఏ సినిమా చేయ‌డంలేదు అంటూ స‌మాధాన‌మిచ్చింది. సో.. కొత్త‌గా రాబోయే హీరోయిన్లు జ‌ర జాగ్ర‌త్త‌!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల

తెలంగాణలో అకాల వర్షాలు.. భారీగా పంట నష్టం.. ఐదుగురు మృతి

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments