Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జెస్సీ'' హీరోయిన్ దమ్ము కొట్టిందా..? బాలయ్య డైలాగ్‌ చెప్తూ సిగరెట్ కాల్చుతూ..? (video)

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:35 IST)
Ashima Narwal
''జెస్సీ'' చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న అషిమా నర్వాల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. నాట‌కం సినిమాతో తెలుగు తెర‌కు పరిచ‌య‌మైన ఈమె జెస్సీతో గుర్తింపు సంపాదించారు. కానీ ఆపై ఆమెకు తెలుగులో ఆఫర్లు అంతంత మాత్రంగానే వున్నాయి.
 
అయితే ఈ అమ్మ‌డు త‌ర్వాత త‌మిళ సినిమాలు చేస్తూ బిజీగా మారారు. అయితే ఇప్పుడు కొత్త‌గా న‌టిస్తున్న ఓ చిత్రంలో త‌న పాత్ర కోసం ద‌మ్ము కొట్ట‌డం నేర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌, ఇఫ్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌, ట్ర‌బుల్ విల్‌ ట్ర‌బుల్స్ యూ, ఐయామ్ నాట్ ద ట్రబుల్.. ఐయామ్‌ ద ట్రూత్" అని ఆవేశంతో చెప్పాల్సిన బాల‌య్య‌ డైలాగ్‌ను కూల్‌గా సిగ‌రెట్ తాగుతూ చెప్పారు.
 
కొస‌మెరుపు ఏంటంటే సిగ‌రెట్ తాగ‌డం హానిక‌ర‌మ‌ని క్యాప్ష‌న్ ద్వారా హెచ్చ‌రిక జారీ చేశారు. అయితే తన కొత్త సినిమా కోసమే సిగ‌రెట్ ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల హైద‌రాబాద్‌ వీధుల్లో షికార్లు కొట్ట‌డం కూడా ప్ర‌మాద‌మేనని పేర్కొన్నారు. 
 
ఇక‌ మ‌నమంద‌రం భూమిని ఇబ్బందిపెడుతున్నామ‌ని, అందుకే భూమాత మ‌న‌ల్ని తిరిగి ఇబ్బంది పెడుతోంద‌ని, నిజానికి భూమి అస‌లు స‌మ‌స్య కాద‌ని, అదే అస‌లు సిస‌లైన నిజ‌మ‌ని బాల‌య్య డైలాగ్ త‌ర‌హాలో చెప్పారు. అయితే ఇది హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల గురించే ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన‌ట్లు క‌నిపిస్తోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments