Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోసెలు వేయడం నేర్చుకున్నా.. వర్కౌట్ కాలేదు.. అందుకే ఈ పని చేస్తున్నా... ఆదాశర్మ

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (14:49 IST)
తెలుగులో ఐరన్ లెగ్‌గా పేరబడిన హీరోయిన్లలో ఆదాశర్మ వరకు 2008లో విడుదలైన హారర్ చిత్రం '1920'తో వెండితెరకు పరిచయమైంది. ఈ అమ్మడు అప్పటినుంచి ఇండస్ట్రీలో ఉంది. కానీ, ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ లేదు. పైగా, హీరోయిన్‌గా చేసిన అన్ని సినిమాలు ఫట్ మన్నాయి. అందుకే, ఈమెకు హీరోయిన్ కంటే.. సైడ్ హీరోయిన్ (రెండో హీరోయిన్) పాత్రలే అధికంగా వరించాయి. అయినప్పటికీ ఇండస్ట్రీ నుంచి వైదొలగిపోలేదు. అడపాదడపా వస్తున్న పాత్రలు చేసుకుంటూ తనలోని నైపుణ్యానికి పదునుపెడుతోంది.
 
ఇందులోభాగంగా కరోనా లాక్డౌన్ వేళ ఈ అమ్మడు దోసలు వేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది వర్కౌట్ కాలేదు. అందుకే మరో విషయంలో తన ప్రావీణ్యతను సత్తా చాటేందుకు నిర్ణయించుకుని పియానో పట్టుకుంది. ఇదే అంశంపై ఈ సిక్కిం సుందరి స్పందిస్తూ, 'సినిమాలు లేకపోతేనేం నేను మరో విషయంలోనూ ప్రావీణ్యతను సంపాదించుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.
 
తాజాగా ఈమె పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందో తెలుసా? ఆదాశర్మ పియానో ప్లే చేసింది. ''నెపోటిజం లేదా ఫేవరేటిజం ఏదైనా కానీ.. సినిమా రంగం నుండి నన్ను బయటకు పంపేసినా, మరో ప్రొఫెషనల్‌గా పియానో నేర్చుకున్నాను. ఇంతకు ముందు దోసలు వేయడం నేర్చుకున్నా.. అదేమీ వర్కవుట్‌ కాలేదు. మీరు నాకు కావాల్సినంత ప్రేమను అందించినందుకు ధన్యవాదాలు. నేను నటిగానే సినిమాల్లో కొనసాగడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అది నా కల" అంటూ అందులో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments