Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైట్ చిత్రీకరణలో విశాల్‌కు తప్పిన పెను ప్రమాదం - తలకు గాయం

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (13:52 IST)
తమిళ స్టార్ హీరో విశాల్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. తాను నటిస్తున్న నాట్ ఏ కామన్ మేన్ అనే చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగులో భాగంగా ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ, తలకు మాత్రం గాయమైంది. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స చేయించుకుని తిరిగి యధావిథిగా ఆ ఫైట్ సన్నివేశాన్ని విశాల్ పూర్తిచేశారు.
 
శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రస్తుతం విశాల్ ‘నాట్ ఏ కామ‌న్ మేన్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఇందులోభాగంగా ఓ ఫైట్‌ సీన్‌ చేస్తుండగా విశాల్‌ తలకు గాయమైంది. 
 
డూప్‌ లేకుండా చేస్తున్న ఈ చిత్రీకరణ సమయంలో విశాల్‌ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్రయూనిట్‌ ఊపిరి పీల్చుకుంది. అంతేకాకుండా ప్రమాదం జరిగినా బ్రేక్‌ తీసుకోకుండా విశాల్‌ నటించడం విశేషం.
 
ఇక ఈ ప్రమాదంపై హీరో విశాల్‌ స్పందిస్తూ.. "తృటిలో తప్పించుకున్నానని, ఆ ఫైటర్‌ తప్పేమీ లేదన్నారు. టైమింగ్‌ మిస్‌ అయ్యిందని, అయినా యాక్షన్‌ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమే. ఆ దేవుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్‌ కంటిన్యూ చేశామని, యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్భుతంగా తెరకెక్కించినందుకు ఫైట్ మాస్టర్ రవివర్మకు థ్యాంక్యూ" అని విశాల్‌ పేర్కొన్నారు. 
 
పైగా, ఫైట్‌ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇక విశాల్‌31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments