Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్‌ఫ్రెండ్‌ను చావబాదిన హీరో... అరెస్టు చేసిన పోలీసులు.. ఎవరా హీరో?

ఆ హీరో వెండితెరపై చూపించినట్టుగా తన ప్రతాపం చూపించాడు. తన ప్రేయసిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఊరుకోకుండా ఆమె ముఖాన్ని పచ్చడి చేసేందుకు యత్నించాడు.

Webdunia
బుధవారం, 20 జులై 2016 (13:35 IST)
ఆ హీరో వెండితెరపై చూపించినట్టుగా తన ప్రతాపం చూపించాడు. తన ప్రేయసిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఊరుకోకుండా ఆమె ముఖాన్ని పచ్చడి చేసేందుకు యత్నించాడు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ సందేహం. ఆయన పేరు టామ్ సీజ్మోర్. ప్రముఖ హాలీవుడ్ నటుడు. సేవింగ్ ప్రైవేట్ రియాన్, బ్లాక్ హాక్ డోన్ వంటి ప్రముఖ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించాడు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. లాస్ ఏంజెల్స్‌లో నటిస్తున్న ఉంటున్న ఈ హీరోకు ప్రియురాలుఉంది. అయితే, మంగళవారం ఉదయం టామ్ ఇంటి నుంచి 911 నెంబర్‌కు పదే పదే ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బాగా ఏడుస్తున్నట్లు కేకలు వినిపించాయి. ఫైటింగ్ జరుగుతున్న రేంజ్ లో చప్పుళ్లు వినిపించాయి. దీంతో, శరవేగంగా అక్కడికి పోలీసులు వెళ్లగా ఓ యువతిపై చేయి చేసుకుంటూ టామ్ కనిపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకు ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. 
 
తొలుత వాదులాడుకున్నవారు అనంతరం చేయిచేసుకునే వరకు గొడవ వెళ్లిందని గుర్తించారు. తన ముఖంపైనా, తలపైన కొట్టాడని పోలీసులకు ఆమె చెప్పింది. గాయాలు కూడా బాగానే పైకి కనిపించాయి. అయితే, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె నిరాకరించింది. అయినప్పటికీ.. అతనిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి.. అతన్ని అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments