Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య ముస్లిం మతాన్ని స్వీకరించాడా? నెట్లో వైరల్ అవుతోన్న కడప మసీదు విజిత్ వీడియో..

సింగం ఫేమ్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగంకు ఇప్పటికే రెండు సీక్వెల్స్ తీశారు. అందులో సూర్య హీరోగా నటించారు. తెలుగులోనూ సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో సూపర్ హీరోగా మంచి ప

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (11:06 IST)
సింగం ఫేమ్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగంకు ఇప్పటికే రెండు సీక్వెల్స్ తీశారు. అందులో సూర్య హీరోగా నటించారు. తెలుగులోనూ సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో సూపర్ హీరోగా మంచి పేరు కొట్టేసిన సూర్య ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన ముస్లింగా మారిపోయారని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ప్రస్తుతం సూర్యకి సంబంధించిన ఓ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. కడపలో సింగం చిత్రీకరణ జరుగుతున్నప్పుడు సూర్య అక్కడి మసీదుని విజిట్ చేశాడు. సూర్యని డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లాడని సమాచారం. సూర్యకి మసీదులో గ్రాండ్ వెలకమ్ లభించినప్పటి సన్నివేశాలు ఆ వీడియోలో ఉండగా, రెండు నిమిషాల 52 సెకన్ల ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
ఈ వీడియోను చూస్తే సూర్య మతం మారాడని కొందరు నెటిజన్లు అంటుంటే.. మరికొందరు మసీదును సందర్శించిన కారణంగా సూర్య మతం మారాడని ఎలా అనుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రార్థన కొరకే సూర్య మసీదుకు వెళ్ళివుండొచ్చునని.. ఆయన మతం మార్పుకోసం వెళ్లలేదని మరికొందరు వాదిస్తున్నారు. మరి దీనిపై సూర్య నోరు విప్పితే కానీ అసలు సంగతేంటో తెలుస్తుంది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments