Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు కావాలా...రూ.19 కోట్లివ్వు... 'ఈగ' విలన్ సుదీప్‌కు భార్య షాక్...

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (09:56 IST)
భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరితే ఒకరి ముఖం ఒకరు చూస్కునే పరిస్థితి లేకపోతే ఇక విడాకులే శరణ్యమని చాలామంది దంపతులు కోర్టులకెక్కుతారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనే విడాకుల సంఖ్య ఎక్కువ ఉంటుందని అనుకుంటారు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా ఈమధ్య విడాకుల కోసం కోర్టు గడప తొక్కుతున్నారు. తాజాగా ఈ జాబితాలో రాజమౌళి ఈగ ఫేమ్ సుదీప్ కూడా చేరిపోయారు.
 
శుక్రవారం సుదీప్ బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో తన భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరారు. కాగా మళయాళీ నాయర్ కుటుంబానికి చెందిన ప్రియారాధాకృష్ణన్-సుదీప్ రెండేళ్లపాటు ప్రేమించుకుని 2001లో పెళ్లి చేసుకున్నారు. వారికి పాప కూడా పుట్టింది. ఆమె వయసు 11 ఏళ్లు. 
 
ఐతే ఇంతకాలం తర్వాత తన భార్యతో తనకు సఖ్యత కుదరడం లేదంటూ సుదీప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రియ స్పందిస్తూ... తనకు రూ. 19 కోట్లు భరణంగా ఇస్తే తప్ప విడాకులకు అంగీకరించేది లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. మరి సుదీప్ ఆ డబ్బు చెల్లించి విడిపోతాడో లేదో చూడాలి.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments