Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీ రిపేర్ చేయడానికెళ్లి సినీ ఛాన్స్ కొట్టేసిన సుబ్బరాజు పెళ్లెందుకు చేసుకోలేదో తెలుసా?

దర్శకుడు కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్ రిపేరు చేయడానికి వెళ్లి సినిమా అవకాశాన్ని కొట్టేసిన వ్యక్తి సుబ్బరాజు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రఫ్‌ అండ్‌ టఫ్‌ విలనీకి కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా మారాడు. 'ఖడ్గం'

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (16:00 IST)
దర్శకుడు కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్ రిపేరు చేయడానికి వెళ్లి సినిమా అవకాశాన్ని కొట్టేసిన వ్యక్తి సుబ్బరాజు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రఫ్‌ అండ్‌ టఫ్‌ విలనీకి కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా మారాడు. 'ఖడ్గం' చిత్రం ద్వారా సినీ ఛాన్స్ కొట్టేసిన సుబ్బరాజు... ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ పరిచయమవడంతో ఆయన కెరీర్‌ ఊపందుకుంది. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌, ప్రభాస్‌ వంటి తెలుగు టాప్‌ హీరోలతోబాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వరకు అందరితోనూ నటించి మెప్పించాడు.
 
టీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చాలా విభిన్నంగా స్పందించాడు సుబ్బరాజు. ‘ముందుగా పెళ్లెందుకు చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన చాలా మంది పెళ్లి జరిగింది అంటుంటారు. నిజానికి పెళ్లి జరగకూడదు.. చేసుకోవాలి. పెళ్లి అనేది సాధారణ విషయం కాదు కదా.. ఏదో క్యాజువల్‌గా జరిగిపోవడానికి. ఇదివరకు రిలేషన్‌లో ఉన్నా. కానీ, అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఒంటరిగా ఉండటం వల్ల బోర్‌ ఫీల్‌ అయి పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేద'ని 39 ఏళ్ల సుబ్బరాజు చెప్పాడు.
 
అలాగే హీరో రవితేజతో నటించేటపుడు చాలా ఇబ్బంది పడతానని చెప్పాడు. కెమెరా ఆన్‌కాకముందు రవితేజ అనేక జోక్‌లు చెప్పి నవ్విస్తాడని, కెమెరా ముందుకు వెళ్లాక ఆయన జోకులు గుర్తుకొచ్చి సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వలేక ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments