Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి పెళ్లి కూతురు హీరో మృతి.. అసలేం జరిగింది..?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:26 IST)
Sidharth Shukla
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేత, బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కన్నుమూశారు. ఆకస్మిక గుండెపోటుతో గురువారం మృతి చెందారు. శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్‌ ఆసుపత్రి ధృవీకరించింది. 
 
సిద్ధార్థ్‌ హఠాన్మరణం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. 40 ఏళ్ళకే నటుడు గుండెపోటుతో మృతి చెందడం షాక్‌కు గురిచేస్తోంది. కాగా సిద్ధార్థ్‌కు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.
 
బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సిద్ధార్ధ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
 
హిందీలో బాలిక వదు అలియాస్ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో హీరోగా సిద్దార్ధ్ శుక్లా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గత సంవత్సరం 2019 - 2020 లో బిగ్ బాస్-13 సీజన్‌లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచాడు. దీంతో సిద్దార్ధ్ శుక్లాకు వరుస సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చాయి.
 
అయితే ఇటీవలే సిద్ధార్ధ్ నటించిన బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3 వెబ్ సిరీస్ విడుదలై ఆకట్టుకుంది. కిస్కి దుల్హనియా, బిజినెస్ ఇన్ రైతు బజార్ సినిమాల్లో సిద్దార్ధ్ శుక్లా నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. విదేశీ అమ్మాయిలను తీసుకొచ్చి?

ఇస్రో ఖాతాలో మరో మైలురాయి: శ్రీహరికోట నుంచి 100వ GSLV రాకెట్‌ ప్రయోగం సక్సెస్

శనివారం పాఠశాలల్లో "నో బ్యాగ్ డే" అమలు చేయాలి.. నారా లోకేష్

నేను కుంభమేళాలో పవిత్ర స్నానం చేశానా?: అంత సీన్ లేదు.. ప్రకాష్ రాజ్

మౌని అమావాస్య- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. 15మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments