సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను... మూడు చిత్రాల్లో నటిస్తున్నాను : సంపూర్ణేష్ బాబు

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (15:47 IST)
తాను అనారోగ్యం బారినపడినట్టు గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారంపై హీరో సంపూర్ణేష్ బాబు స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు చెప్పారు. పైగా, తాను ప్రస్తుతం మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో ఒకటి "మార్టిన్ లూథర్ కింగ్" ఒకటి వివరించారు.
 
ఇక ఇండస్ట్రీలో కొందరు కావాలనే సంపూని తొక్కేస్తున్నారని, అందుకే పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తుంది కదా అనే ప్రశ్నకు సంపూర్ణేష్ బాబు సమాధానమిస్తూ, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తనతో అందరూ బాగనే ఉన్నారని, తనకు ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన చెప్పారు. 
 
కాగా, తమిళంలో యోగిబాబు హీరోగా నటించిన "మండేలా" చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి "మార్టిన్ లూథర్ కింగ్" పేరుతో రీమేక్ చేశారు. యోగిబాబు పాత్రను సంపూర్ణేష్ బాబు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

Komatireddy: ఏపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారా?

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రక్షణ తయారీ కేంద్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments