Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు... ఆస్పత్రిలో అడ్మిట్!

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (08:38 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ దాడి కూడా ఆయన నివాసంలోనే జరగడం గమనార్హం. గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి రెండుమూడుసార్లు కత్తితో పొడిచారు. ఈ దాడిలో గాయపడిన సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. నిందితులు గురువారం తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచాడని, ఆ తర్వాత అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. గతంలో కూడా మరో స్టార్ హీరో సల్మాన్ ఖా‌న్‌పై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడం గమనార్హం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఘటన ముంబై మహానగరంలో శాంతిభద్రతల సమస్యను తేటతెల్లం చేస్తుంది. ఇది బీజేపీ పాలకులకు తలవంపు వంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్షల్ లా చట్ట ఉల్లంఘన : దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు!

బీజేపీని ఓడించాలంటే కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవాలి : శరద్ పవార్

పశు సంపదను పూజించే పవిత్ర కార్యక్రమం కనుమ : సీఎం చంద్రబాబు

కొత్త అల్లుడికి 465 వంటకాలతో సంక్రాంతి విందు.. (Video)

సింగర్‌తో కలిసి యువతిపై హర్యానా బీజేపీ చీఫ్ అత్యాచారం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments