Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ సుమ సంపాదన గురించి నేను అడగను.. రాజీవ్ కనకాల

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (10:47 IST)
సినీ నటుడు రాజీవ్ కనకాల తన భార్య, యాంకర్ సుమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోయిన్ల‌ను మించి సుమ పారితోషికం తీసుకుంటుంద‌ని ప్ర‌చారం చేయ‌డంలో అర్థం లేద‌న్నాడు. కాకపోతే ఆమె లక్షల్లో తీసుకుంటుందని చెప్పాడు. కానీ ఎన్ని ల‌క్ష‌లు తీసుకుంటుంద‌నేది మాత్రం తెలియ‌దని రాజీవ్ కనకాల వ్యాఖ్యానించాడు. 
 
పైగా రోజుకు ఎనిమిది గంట‌లు నిల్చొని.. అన్ని లైట్స్ మ‌ధ్య‌లో షోస్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాద‌ని.. ఒక్క‌సారి ఆ కష్టం మీరే ఊహించుకోండని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. రోజూ మీరు స్పీకర్లు ఆన్ చేసేకుంటే తెలియ‌కుండానే మైండ్‌పై ప్ర‌భావం ప‌డుతుంది.. అవ‌న్నీ భ‌రిస్తూ షో చేయ‌డం అంటే గొప్ప విషయమని తెలిపాడు. 
 
ఇంత చేసినా కూడా మీరు ఊహించుకునేంత రెమ్యున‌రేష‌న్ ఏముండ‌ద‌ని రాజీవ్ చెప్తున్నాడు. ఎప్పుడూ త‌న సంపాద‌న గురించి అడ‌గ‌లేద‌ని.. ఆమె స్పేస్ ఆమెకే వ‌దిలేస్తానంటున్నాడు రాజీవ్ కనకాల. మొత్తానికి సుమ క‌న‌కాల విజ‌యం వెన‌క మాత్రం ఆమె క‌ష్టం త‌ప్ప మ‌రేం లేదంటున్నాడు ఈయ‌న‌. భ‌ర్త‌గా తాను చేయాల్సిన స‌పోర్ట్ చేస్తాను కానీ ఆమె కెరీర్ విష‌యంలో వేలు పెట్ట‌నంటున్నాడు ఈ న‌టుడు. తాజాగా మ‌హ‌ర్షి సినిమాలో చిన్న పాత్ర‌లో కనిపించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments