Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహది పెద్ద మనసు... రైతులకు ఆర్థిక సాయం.. విశాల్ స్ఫూర్తితో....

సినీ నటి స్నేహ. వెండితెరపై తన అందంతో పాటు.. అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. ఇపుడు నిజ జీవితంలో కూడా ఆమె అదే పెద్ద మనసుతో రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ముఖ్యంగా... తమిళ చిత్ర నిర్మాతల మండ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (08:47 IST)
సినీ నటి స్నేహ. వెండితెరపై తన అందంతో పాటు.. అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. ఇపుడు నిజ జీవితంలో కూడా ఆమె అదే పెద్ద మనసుతో రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ముఖ్యంగా... తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ కృష్ణన్ నిర్ణయం మేరకు... స్నేహ దంపతులు పెద్ద మనుసును నిరూపించుకున్నారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన కరవుకాటకాల వల్ల అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్న కుటుంబాల్లో ఓ పది ఫ్యామిలీలను ఆ దంపతులు ఆదుకున్నారు. ముఖ్యంగా.. 10 మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా స్నేహ మాట్లాడుతూ... మనకు అన్నం పెట్టే రైతులు ఎంత కష్టపడుతున్నారో చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. తాము చేసిన సాయం చాలా చిన్నదే అయినా, మరింత మంది రైతులను ఆదుకునేందుకు ఇది దోహదపడుతుందన్న ఉద్దేశంతోనే అందరి సమక్షంలో రైతులకు సాయం చేస్తున్నామన్నారు. 
 
ఆ తర్వాత ప్రసన్న దంపతులు మాట్లాడుతూ... ‘రైతులు పడుతున్న బాధల్ని టీవీలో చూస్తున్నప్పుడు వారికి ఏదైనా సాయం చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు... ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాల్‌కు ఇచ్చిన మొత్తాన్ని రైతులకు ఇచ్చేయడం చూశాం. ఆ స్ఫూర్తితోనే రైతులకు ఆర్థిక సాయం చేశాం.’ అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments