Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత సమాధికి 'తలైవి' కంగనా పుష్పాంజలి

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:35 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శనివార చెన్నైలో సందడి చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రధారిగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని కంగనా రనౌత్ చెన్నైకు వచ్చారు. ఈ సందర్భగా చెన్నై మెరీనా బీచ్‌లోని జ‌య‌ల‌లితతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధి వ‌ద్ద పుష్ప నివాళి అర్పించారు.
 
తలైవి చిత్రం గత ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సివుంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేశారు. అయితే తలైవీ సినిమాను ఈ నెల‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో న‌టి కంగ‌నా.. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఉన్న జ‌య స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి పుష్ప నివాళి అర్పించారు.
 
ఏఎల్. విజ‌య్ డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమాను రూపొందించారు. క‌రోనా నేప‌థ్యంలో తొలుత త‌లైవీ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసినా.. థియేట‌ర్ ఓన‌ర్ల ఆందోళ‌న‌తో మొద‌ట ఆ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు అంగీక‌రించారు. ఈ మూవీలో కంగ‌నా రనౌత్‌తో పాటు అర‌వింద స్వామి, సామ్నా కాసిమ్‌, సముద్రఖని, భాగ్య‌శ్రీ, ప్రియ‌మ‌ణి న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

Coronavirus: బాలీవుడ్ నటి నికితా దత్తాకు కరోనా పాజిటివ్.. హలో చెప్పడానికి వచ్చిందట!

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments