Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటుడు దర్శన్ మేనేజర్ ఆత్మహత్య!!

వరుణ్
బుధవారం, 19 జూన్ 2024 (11:55 IST)
కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన హీరో దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు అనేక అనుమానాలకు దారితీస్తుంది. కన్నడ ప్రముఖ హీరోగా వెలుగొందుతున్న దర్శన్ అనూహ్య రీతిలో తన అభిమానినే హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు కావడం సంచలనం సృష్టించింది.
 
వివాహితుడైన దర్శన్ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తుండగా తన అభిమాన హీరో కాపురంలో చిచ్చుపెడుతున్నావంటూ దర్శన్ అభిమాని రేణుకాస్వామి అనే యువకుడు పవిత్ర గౌడ సోషల్ మీడియా ఖాతాకు అసభ్య సందేశాలు పంపించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హతమార్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని దర్శన్ ఫాం హౌస్‌లో శ్రీధర్ మృతదేహాన్ని గుర్తించారు. ఒంటరితనం వల్లే చనిపోతున్నట్టు శ్రీధర్ తన సూసైడ్ నోట్, వీడియో సందేశంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments