Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ విక్రయిస్తున్న కన్నడ నటుడు కిషోర్ అమన్ శెట్టి అరెస్టు

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (09:44 IST)
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో సహా మరికొందరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నందుకుగాను కన్నడ నటుడు, కొరియోగ్రాఫర్ అయిన కిషోర్ అమన్ శెట్టిని మంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. అమన్ శెట్టి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కార్యక్రమంతో మంచి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏబీసీడీ.. ఎనీ బడీ కెన్ డ్యాస్ చిత్రంలో కూడా నటించాడు. 
 
ఈ విషయాన్ని వెల్లడించిన మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ వికాశ్ కుమార్, వీరిద్దరూ మాదకద్రవ్యమైన 'ఎండీఎంఏ'ను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వీరిద్దరూ కలిసి డ్రగ్స్ సంపాదించిన తర్వాత, బైక్‌పై వెళుతూ పట్టుబడ్డారని, రెండో వ్యక్తిని అఖీల్ నౌషీల్‌గా గుర్తించామని తెలిపారు.
 
వీరికి డ్రగ్స్ ముంబై నుంచి వచ్చాయని గుర్తించామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని, ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్) చట్టం కింద వీరిపై కేసును రిజిస్టర్ చేశామని తెలిపారు. కాగా, ఇదే కేసులో మరో ఇద్దరు విదేశీయులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments