Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నా : నటుడు చలపతిరావు

"అమ్మాయిలు హానికరం కాదుకానీ... పక్కలోకి పనికివస్తారంటూ" వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన టాలీవుడ్ సినీ నటుడు చలపతిరావు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుంద

Webdunia
గురువారం, 25 మే 2017 (17:11 IST)
"అమ్మాయిలు హానికరం కాదుకానీ... పక్కలోకి పనికివస్తారంటూ" వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన టాలీవుడ్ సినీ నటుడు చలపతిరావు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని కానీ చేసుకోలేక పోయినట్టు చెప్పారు. 
 
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ "నేను సినిమాల్లోకి రాకముందే ప్రేమ వివాహం చేసుకున్నాను. అయితే నాకు 27 ఏళ్ల వయసు వచ్చేసరికే నా భార్య కన్నుమూసింది. అప్పటికి నేను చాలా పేదరికంలో ఉన్నాను. అప్పటికే నాకు ముగ్గురు పిల్లలు. ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కాలేదు. కళ్ల ఎదురుగా ముగ్గురు పిల్లలు, ఆర్థిక ఇబ్బందులు. అప్పుడు ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన వచ్చింది. కానీ, పిల్లలు దిక్కులేని వాళ్లు అయిపోతారని ఆ ఆలోచన మానుకున్నాను.
 
ఆ సమయంలో సీనియర్‌ ఎన్టీయార్‌, ఆయన భార్య తారకమ్మ ఎంతో ధైర్యం చెప్పారు. ఓదార్చారు. మళ్లీ పెళ్లి చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ, నా మనసు అందుకు అంగీకరించలేదు. నా పిల్లలను పెంచి పోషించడమే నా ధ్యేయం అనుకున్నాను. సినిమాల్లో ఎంతో కష్టపడ్డాను. ముగ్గురు పిల్లలను అమెరికాలో చదివించాను. ముగ్గురూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు అయ్యారు. జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంద’ని చెప్పారు చలపతిరావు.
 
కాగా, ఇప్పటివరకు సుమారు 1500పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన 70 యేళ్ళ చలపతిరావు... ఎన్టీయార్‌ ప్రోత్సాహంతో దాదాపు 50 ఏళ్ల సినిమా కెరీర్‌ను సునాయాసంగా పూర్తి చేసుకున్నారు. కానీ, సినీ జీవితంలో ఒకటిరెండు వివాదాల్లో చిక్కుకుని క్షమాపణలు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో కూడా ఆయన అమ్మాయిల గురించి వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments