Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సానా కష్టం వచ్చిందే మందాకినీ...' అంటున్న "ఆచార్య" (Song Promo)

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (17:02 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, మ్యాట్నీ మూవీ మేకర్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. హీరో రామ్ చరణ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అయితే, ఈ చిత్రంలోని పాటలను అపుడపుడూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే "లాహె లాహె", "నీలాంబరీ" పాటలను రిలీజ్ చేయగా, వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా "సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ళ కళ్లు కాకులెత్తుకుపోనీ... సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగిపోనీ..." అంటూ ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ పాట ఐటమ్ సాంగ్‌లా కనిపిస్తుంది. 
 
ఈ చిత్రంలో గిరిజనలు బతుకు చిత్రాలను కళ్లకు కట్టిలా దర్శకుడు చూపించనున్నట్టు ఇప్పటికే విడుదలైన చిత్ర ప్రోమోల ద్వారా స్పష్టమైంది. లాహె లాహె పాట గిరిజన సంస్కృతిని ప్రతిబింభించేలా వుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments