Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్ చేరుకున్న `ఆచార్య`

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (16:50 IST)
Acharya, chiru
మెగాస్టార్ చిరంజీవి ఖ‌మ్మం నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. ఆయ‌న కథానాయకుడిగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్ ఫుల్ మెగా ఎంట‌ర్ టైన‌ర్ `ఆచార్య`‌. రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో  కాజ‌ల్‌, పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు.

ఇటీవ‌ల ఖ‌మ్మం షెడ్యూల్ తో చిత్ర‌బృందం బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి- రామ్ చ‌రణ్ పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ-``ఖ‌మ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హ‌ద‌రాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి, చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాం`అని తెలిపారు. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments