Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో ఆచార్య షూటింగ్.. చిరంజీవికి అపూర్వ స్వాగతం

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (14:15 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులోభాగంగా ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందుకోసం ఆయన రాజమండ్రికి వచ్చిన చిరంజీవికి పూర్వస్వాగతం లభించింది. ఇక్కడి మధురపూడి ఎయిర్ పోర్టు ప్రాంతమంతా మెగా అభిమానులతో నిండిపోయింది.
 
అంతేకాదు, విమానాశ్రయం నుంచి షూటింగ్ జరుగుతున్న కోరుకొండ, మారేడుమిల్లి వరకు చిరంజీవిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. చిరంజీవిపై పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ తమ ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు చిరంజీవి ముగ్ధుడయ్యారు. 
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగే షెడ్యూల్‌లో రామ్ చరణ్ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది. 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారనీ అక్కను, అమ్మను హత్య చేయించిన యువతి (Video)

కాంగ్రెస్‍‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్నారు : రాహుల్ గాంధీ

ఏపీకిలో టాటా గ్రూపు రూ.49 వేల కోట్ల పెట్టుబడులు

ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్న జగన్ అండ్ కో : టీడీపీ నేతల కౌంటర్

శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments