Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ట‌ర్ ఛెఫ్‌కు త‌మ‌న్నా డుమ్మా... చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (21:42 IST)
Chefs with Tamanna
దక్షిణాది టీవీ ప్రేక్ష‌కుల‌కు వంట రుచులు ప‌రిచ‌యం చేసే కాన్సెప్ట్‌తో తెలుగులో త‌మ‌న్నా ఆధ్వ‌ర్యంలో మాస్ట‌ర్ ఛెఫ్ ప్రోగ్రాం నిర్వ‌హించారు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తిని హోస్ట్‌గా పెట్టారు. బెంగుళూరుకు చెందిన ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ (IFA) లో మాస్ట‌ర్ చెఫ్ సెట్ వేసి ఆర్భాటంగా క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత షూట్ చేశారు. అయితే ఈ ప్రోగ్రామ్ పెద్ద‌గా రేటింగ్ రాక‌పోవ‌డంతోనో మ‌రో కార‌ణంతోనే అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం త‌మ‌న్నా షూట్‌కు రాక‌పోవ‌డంతో నిర్వాహ‌కులు ఆమె స్థానంలో టీవీ యాంక‌ర్‌, న‌టి అన‌సూయ‌ను రీప్లేస్ చేశారు.

 
అయితే త‌న‌కు ఇంకా 56 ల‌క్ష‌లు ఇవ్వాల్సి వుంద‌నీ, అగ్రిమెంట్ ప్ర‌కారం ఏవీ స‌రిగ్గా జ‌ర‌గ‌లేదంటూ విమ‌ర్శిస్తూ చ‌ట్ట‌ప‌రంగా రాబ‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వారికి తెలియ‌జేసింది. దానిపై మంగ‌ళ‌వారం రాత్రి ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ MD శ్రీ శరవణ ప్రసాద్ అధికారిక ప్రకటన జారీ చేశారు.

 
అందులోని సారాంశం ప్ర‌కారం ఆమె స‌రిగ్గా ఛెఫ్ కార్య‌క్ర‌మానికి రావ‌డంలేద‌నీ, అనుకున్న‌ట్లు ఆమెకు ముందుగా కోటి రూపాయ‌లు ఇచ్చామ‌ని తెలియ‌జేస్తూ ఓ లెట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇందుకు చ‌ట్ట‌ప‌రంగా తామూ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది.

 
అస‌లు బెంగుళూరు ఈ కార్య‌క్ర‌మం కోసం నిర్వాహ‌కులు చాలా వెచ్చించారు. ద‌క్షిణాదిలోని తెలుగు, క‌న్న‌డం, త‌మిళ మీడియా ముందు త‌మ‌న్నా ఈ చెఫ్ గురించి గొప్ప‌గా చెప్పింది. కానీ అప్ప‌ట్లోనే ఆమె లేట్‌గా రావ‌డం అందుకోసం మీడియా గంట‌ల‌త‌ర‌బ‌డి వెయిట్ చేయ‌డం జ‌రిగింది. 

 
ఇక ఈ ప్రోగ్రామ్‌ను మొద‌ట వెంక‌టేష్‌ను అనుకున్నారు. ఆ త‌ర్వాత మ‌రో హీరోయిన్‌ను అనుకున్నారు. ఫైన‌ల్‌గా వెంకీ రిక‌మండేష‌న్‌తో త‌మ‌న్నాను వారు ఎంపిక చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments