Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకున్న అభిషేక్ బచ్చన్ : చేతికి కట్టుతోనే ఇంటికి డిశ్చార్జ్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:59 IST)
ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తిరికికోలుకున్నారు. దీంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చేతికి కట్టుతోనే ఆయన ఇంటికి చేరుకున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం చెన్నైలో జ‌రుగుతున్న త‌న కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్న అభిషేక్.. ఓ సన్నివేశం షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఈ ప్ర‌మాదంలో కుడి చేతికి గాయం కాగా, ఆ గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేర్చారు. 
 
తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ నంద ఆసుపత్రికి వెళ్లి అభిషేక్‌ను పరామర్శించగా, ఆ పిక్స్ వైర‌ల్ అయ్యాయి. అభిషేక్ కోలుకోవ‌డంతో ఆయన.. మళ్లీ చెన్నై బయలుదేరాడు. ఈ సందర్భంగా చేతికి పెద్ద కట్టుతో ఉన్న ఫొటోను జూనియర్ బచ్చన్ షేర్ చేశాడు. 
 
'కొత్త సినిమా సెట్స్‌లో బుధవారం పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కుడి చెయ్యి విరిగింది. దీనికి సర్జరీ అవసరమైంది. అందుకే ముంబైకి క్విక్ ట్రిప్ వేయాల్సి వచ్చింది. స‌ర్జ‌రీ పూర్తైంది. క‌ట్టుతోనే ప‌ని మొద‌లు పెట్ట‌డానికి చెన్నై వ‌చ్చేశాను. షో ఆగకూడదు కదా! మా నాన్న అన్నట్లు ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ (మగవాడికి నొప్పి ఉండదు). ఓకే, ఓకే కొంచెం నొప్పిగా ఉంది. మీ విషెస్‌కు, త్వరగా కోలుకోవాలన్న మెసేజిలకు ధన్యవాదాలు' అని అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments