వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

సెల్వి
గురువారం, 17 ఏప్రియల్ 2025 (09:15 IST)
Abhinaya
నటి అభినయ తన చిన్ననాటి స్నేహితుడు, చిరకాల ప్రేమికుడైన వేగేశ్న కార్తీక్‌ను అధికారికంగా వివాహం చేసుకుంది. ఈ జంట 15 సంవత్సరాల స్నేహం, ప్రేమ ప్రయాణం ఇప్పుడు అందమైన వివాహంగా వికసించింది. అభినయ సోషల్ మీడియాలో వివాహ చిత్రాలను పంచుకుంది. సినీ రంగ సభ్యులు నూతన వధూవరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
వీరి వివాహం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వాహం జరిగింది. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక ఈనెల 20వ తేదీ హైదరాబాదులోనే గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరగబోతుంది. 
 
ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
అభినయ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. రవితేజ హీరోగా వచ్చిన నేనింతే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన అభినయ అనంతరం కింగ్, సంగమం, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్ తదితర చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించారు. ఇక మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వారికి చెల్లెలు పాత్రలో నటించి అభినయ మరింత గుర్తింపు సంపాదించుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

Students: పాదాలకు విద్యార్థులచేత మసాజ్ చేసుకున్న టీచర్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments