Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ ఖాన్ ఇంటికి వచ్చిన కరోనా.. సిబ్బందిలో కొందరికి కోవిడ్..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:02 IST)
Amir khan
బాలీవుడ్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. మొన్నామధ్య బోనీ కపూర్ ఇంట్లో కూడా చాలా మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఇంటికి కూడా కరోనా వచ్చింది. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

తన సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారని తెలియజేశాడు. సిబ్బందికి రావడంతో అమీర్ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ల అమ్మకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో తన కుటుంబ సభ్యులతో పాటు తల్లికి నెగటివ్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 
 
ఈ విషయంపై వెంటనే స్పందించిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు అమీర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇక వైరస్ సోకిన వాళ్లను క్వారంటైన్‌కు పంపినట్లు అమీర్ తెలిపాడు. వాళ్లకేం సాయం కావాలన్నా కూడా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. దేశంలో కరోనా ప్రమాద స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుంది. ముంబైలో ఇప్పటికే లక్ష కేసులు దాటిపోయాయి. దాంతో అంతా అప్రమత్తంగా ఉండాలని అమీర్ ఖాన్ సూచించాడు.
 
ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తున్నారు. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ సినిమాకు ఇది రీమేక్. ఇందులో క్లైమాక్స్‌లో కూడా కరోనా వైరస్ గురించి చెప్పబోతున్నాడు. దీనికి అద్వైత్ చందన్ దర్శకుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments