Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (13:08 IST)
బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలను పాటిస్తూ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అదేసమయంలో తనను కలిసినవారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరినట్టు ఆయన అధికార ప్రతినిధి ట్విట్టర్ ఖాతాలో ద్వారా వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గ‌త‌ 24 గంట‌ల్లో 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 23,907 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,34,058కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 275 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,441కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,05,160 మంది కోలుకున్నారు. 3,68,457 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 5,08,41,286 మందికి వ్యాక్సిన్లు వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,64,38,861 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,25,628 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments