Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది పినిశెట్టి ద్విభాషా చిత్రం శబ్దం

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (19:22 IST)
Adi Pinishetti
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా.. రెండు పాత్రలలో అలరిస్తున్న డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్  ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్‌హిట్‌ 'వైశాలి' తర్వాత దర్శకుడు అరివళగన్‌తో రెండోసారి చేతులు కలిపారు. విజయవంతమైన కాంబో చాలా కాలం తర్వాత రాబోతున్న ఈ చిత్రాన్ని రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. 7G ఫిల్మ్స్ శివ,  ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
 మేకర్స్ ఈ చిత్రానికి 'శబ్దం' అనే టైటిల్ ప్రకటించారు. టైటిల్ పోస్టర్ టైటిల్ లానే ఆసక్తిని కలిగిస్తుంది. పోస్టర్ లో భారీ సంఖ్యలో గబ్బిలాలు చెవికి చేరుకోవడం,  టైటిల్ సౌండ్ వేవ్‌గా రూపొందించారు. ఈ అద్భుతమైన పోస్టర్ ద్వారా చిత్ర బృందం సినిమా జానర్‌ని తెలియజేసింది. ఆది, అరివళగన్ ‌ల మొదటి చిత్రం వైశాలి లానే 'శబ్దం' కూడా సూపర్‌ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ గా ఉండబోతోంది.
 
 'శబ్దం' ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అరుణ్ బత్మనాభన్ కెమెరా మెన్ గా పని చేస్తుండగా, స్టార్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాబు జోసెఫ్ ఎడిటర్ గా మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments