Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ సినిమాతో లావణ్య త్రిపాఠి కష్టాలు.. లండన్ వెళ్లే ముందు హ్యాండిచ్చింది..

కోలీవుడ్ సినిమాతో లావణ్య త్రిపాఠి కష్టాల్లో పడింది. నాగచైతన్య, తమన్నా జంటగా తెలుగులో విడుదలైన 100% లవ్ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ హీరోగా, లావణ్య త్రిపాఠి హ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (13:13 IST)
కోలీవుడ్ సినిమాతో లావణ్య త్రిపాఠి కష్టాల్లో పడింది. నాగచైతన్య, తమన్నా జంటగా తెలుగులో విడుదలైన 100% లవ్ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో కొంతభాగం షూటింగ్‌ను లండన్‌లో జరపాలని నిశ్చయించిన సినీ యూనిట్‌కు లావణ్య త్రిపాఠి గట్టి షాక్ ఇచ్చింది.
 
భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాల ద్వారా మంచి పేరు కొట్టేసిన లావణ్య.. తమిళ సినిమా 100% కాదల్ రీమేక్ కోసం లండన్‌కు బయల్దేరే సమయానికి హ్యాండిచ్చింది. దీంతో దర్శకనిర్మాతలు కోపంతో ఊగిపోయారు. 
 
ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో  తమకు భారీ నష్టం వాటిల్లిందని దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో సినీ దర్శకుడు చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతారాహిత్యంతో నష్టపోయామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ గొడవతో లావణ్య త్రిపాఠి కష్టాలొచ్చాయి. ఈ సమస్య నుంచి లావణ్య ఎలా బయటపడుతుందో మరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments