Webdunia - Bharat's app for daily news and videos

Install App

7/జీ బృందావన్‌ కాలనీ పార్ట్ 2 వచ్చే నెలలో మొదలౌతుంది: ఏ.ఎం.రత్నం

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (10:43 IST)
7/G Brindavan Colony team
ప్రముఖ నిర్మాత ఏయం రత్నం నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ వెండితెరపై ఆవిష్కరించిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ ‘7/జీ బృందావన్‌ కాలనీ’. రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా సంచలన సాధించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకులని అలరింబోతుంది. నిర్మాతలు ఉదయ్, యతి ఏయు సినిమాస్ & వివై ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసిన మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.  
 
ప్రెస్ మీట్ లో నిర్మాత ఏయం రత్నం మాట్లాడుతూ.. నేను చేసిన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ‘7/జీ బృందావన్‌ కాలనీ’ కల్ట్ మూవీ. ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. తెలుగు తమిళ్ రెండూ భాషల్లో పెద్ద విజయం సాధించింది. ఇదొక పోయిటిక్ సినిమా. సినిమా ప్రారంభం ముగింపు పొయిటిక్ గా వుంటాయి.  ఉదయ, యతి చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని రిరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ లో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం వుంది. రవితో మళ్ళీ రీఎంట్రీలా ‘7/జీ బృందావన్‌ కాలనీ’ పార్ట్ 2 ని వచ్చే నెల నుంచి మొదలుపెడుతున్నాం. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది.’’ అన్నారు.
 
రవికృష్ణ మాట్లాడుతూ..ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ రవి పాత్రలోకి వెళ్ళిపోయాను ( నవ్వుతూ) చాలా రోజులు గా రీరిలీజ్ చేయాలనీ నాన్న గారు అనుకున్నారు. సెకండ్ పార్ట్ ని కూడా ప్లాన్ చేస్తున్నాం. పార్ట్ 2కి ముందు మరోసారి 7/జీ మ్యాజిక్ చూపించేలా చిత్రం రీరిలీజ్ జరుగుతోంది. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
 
సోనియా అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘7/జీ బృందావన్‌ కాలనీ’ చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా వుంది. మీ అందరి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. అందరూ తప్పకుండా ఈ సినిమా థియేటర్స్ లో చూడండి’’ అని కోరారు.
 
ఉదయ్ మాట్లాడుతూ.. మాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నం గారికి కృతజ్ఞతలు. రీరిలీజ్ ప్రింట్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సుమన్ శెట్టితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments