Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప హవా...

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (08:28 IST)
బెంగుళూరు వేదికగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప చిత్రం తన సత్తా చాటింది. దక్షిణ భారత చలన చిత్రరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. 
 
కరోనా పరిస్థితులతో  గడిచిన కొన్నేళ్లు నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక..  ఈ ఏడాది స్టార్‌ నటీనటుల సమక్షంలో ఘనంగా జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌కు ఈ ఏడాది ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారం వరించింది.
 
ఈసారి ఫిలింఫేర్‌లో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన టాలీవుడ్‌ చిత్రం 'పుష్ప' హవా నడిచింది. మొత్తం ఏడు విభాగాల్లో ఆ చిత్రం సత్తా చాటింది. తమిళంలో సూర్య కథానాయకుడిగా నటించిన 'సూరారై పోట్రు'.. ఏడు అవార్డులను దక్కించుకుంది.
 
తెలుగు చిత్రాలకు దక్కిన ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఇవే... 
ఉత్తమ చిత్రం: పుష్ప - ది రైజ్
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప - ది రైజ్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప - ది రైజ్‌)
ఉత్తమ నటి: సాయిపల్లవి (లవ్‌స్టోరీ)
ఉత్తమ సహాయనటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయనటి:  టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప - ది రైజ్)
ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (జాను) (లైఫ్‌ ఆఫ్‌ రామ్‌)
ఉత్తమ గాయకుడు: సిద్ద్‌ శ్రీరామ్‌ (పుష్ప ది రైజ్‌ - శ్రీవల్లి)
ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్‌ (పుష్ప ది రైజ్‌ - ఊ అంటావా మావ)
విమర్శకుల ఉత్తమ నటి: సాయిపల్లవి (శ్యామ్‌సింగ్‌రాయ్‌)
విమర్శకుల ఉత్తమ నటుడు: నాని (శ్యామ్‌సింగరాయ్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: శేఖర్‌ మాస్టర్‌ (అల వైకుంఠపురములో - రాములో రాములా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: మిరోస్లా బ్రొజెక్ (పుష్ప - ది రైజ్)
ఉత్తమ నూతన నటి: కృతిశెట్టి (ఉప్పెన)
ఉత్తమ నూతన నటుడు: వైష్ణవ్‌ తేజ్‌ (ఉప్పెన)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments