కళకు అంతం లేదని చెప్పే సాగర సంగమంకు 38 ఏళ్ళు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:01 IST)
Sagara sangamam
కే.విశ్వనాధ్, ఏడిద నాగేశ్వరరావు, కమలహాసన్ కలయికలో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక, కళాత్మక చిత్రం `సాగర సంగమం. ఈ చిత్రం జూన్ 3 ,1983న తెలుగులో విడుద‌లైంది.తమిళంలో `సలంగై ఓలి, మలయాళంలో సాగర సంగమంగా ఒకే రోజు విడుదల అయ్యాయి. అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది. నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నోసార్లు వ్యక్తపరిచారు.
 
Viswanath- edida
ర‌ష్యాలో 400 థియేట‌ర్ల‌లో
శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్- ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళా ఖండం. భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా CNN-IBNs List of the 100 Greatest Indian Films of All Time లో ఈ చిత్రం 13వ స్థానం దక్కించుకుంది. అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకేసారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం. అలాగే శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబిలీ , గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుంది. బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం. 
 
kmal
యువ‌త‌ను ప్రేరేపించింది
ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారు . ఇప్పటికీ లోక నాయకుడు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే ముందుంటది. అలాగే కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది. ఇక ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ఓ హై లైట్. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది. అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం. 
 
jayaprada- kamal
బాలీవుడ్ న‌టులు హాజ‌రు
అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకీ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, నివాస్ ఫోటోగ్రఫీ , తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని all time classic గా రూపుదిద్దింది. ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేసి సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు. 
 
jayaprada- kamal
జయప్రద హావభావాలు
కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే “తకిట -తధిమి” పాట, జయప్రదతో కలిసి చేసే, నాద వినోదము` క్లైమాక్స్ లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త  అనుభూతినిస్తాయి. అలాగే మౌనమేలనోయి పాటలో జయప్రద చూపిన హావభావాలు, ఎస్.పి. శైలజ నటన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత. సిరి సిరి మువ్వ, శంకరాభరణం తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక దృశ్య కావ్యం సాగరసంగమం. కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “ NO END FOR ANY ART “ అని వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments