Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళుగా వేధిస్తున్నాడు... 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యా మీనన్

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (14:17 IST)
మలయాళ నటి నిత్యామీనన్ తనకు ఎదురైన వేధింపులపై తాజాగా స్పందించారు. సంతోష్ వర్కీ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ ఆరేళ్ళుగా వేధిస్తున్నాడని, అతనికి చెందిన దాదాపు 30 నంబర్లను బ్లాక్ చేసినట్టు చెప్పాడు. 
 
వీటిపై ఆమె స్పందిస్తూ, "కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచి ఈ వార్తలు వెలువడుతున్నాయి. 
 
నిజం చెప్పాలంటే, అతడు దాదాపు ఆరేళ్ల నుంచి నన్నూ, నా కుటుంబాన్నీ వేధిస్తున్నాడు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. దాదాపు 30 ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేశా. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగించేవాడు. దాంతో మా ఇంట్లోవాళ్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నోసార్లు చెప్పారు. 
 
కానీ నేను అలా చేయకుండా క్షమించి వదిలేశా. అతడి మానసిక స్థితి బాగోలేదనుకుంటా.. వదిలేద్దాం అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. కానీ అతడింకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు  చేస్తున్నాడు" అని నిత్యామేనన్‌ వివరించారు.
 
ఇక, నిత్యామేనన్‌ త్వరలోనే ఓ బిజినెస్‌ మ్యాన్‌ని వివాహమాడనున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఎంతోకాలం నుంచి ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. అవన్నీ అవాస్తవాలేనంటూ నిత్య ఓ వీడియో సందేశంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments