Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర లెవల్లో షారూక్ లుక్ - జవాన్ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్!

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (16:48 IST)
గత నెల రోజులుగా షారూక్ ఖాన్ నటించిన జవాన్ మేనియా దేశ వ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు టీజర్, పాటలు ఇలా ప్రతిదీ అంతకంతకూ హైప్ పెంచుతూనే ఉన్నాయి. 
 
ఇదిలావుంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ చివరి షాట్‌లో గుండుతో కనిపించిన షారూక్ ఖాన్ లుక్‌ను రిలీజ్ చేశారు. నేను మంచోడినా.. చెడ్డోడినా అనేది మరో 30 రోజుల్లో తెలుస్తుంది అంటూ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. చేతిలో గన్ పట్టుకుని గుండుతో ఉన్న షారూక్ ఖాన్‌ లుక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. 
 
అట్లీ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. షారూక్ ఖాన్ సరసన నయనతార నటించారు. ఇక ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులన్నీ కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని, విడుదలకు ముందే సినిమాకు రూ.300 కోట్లు లాభాలు వచ్చాయన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments