Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురుచూపు... ఆమె అతడికి అలా వుంటుందట...(video)

ట్విట్టర్ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం ట్రెయిలర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం విడుదలకు మరో మూడు రోజులే సమయం వుంది. మే నెల 19న విడుదల కాబోతోందీ చిత్రం. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి

Webdunia
మంగళవారం, 16 మే 2017 (11:49 IST)
ట్విట్టర్ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం ట్రెయిలర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం విడుదలకు మరో మూడు రోజులే సమయం వుంది. మే నెల 19న విడుదల కాబోతోందీ చిత్రం. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రం చేతన్ భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల ఆధారంగా నిర్మితమైంది.
 
చేతన భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల మూడేళ్ల క్రితం అక్టోబరు 1, 2014న విడుదలైంది. ఈ నవలలో చేతన్ నేటి ప్రపంచంలోని మానవ సంబంధాలలో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఈ నవలలో ఢిల్లీకి చెందిన అందమైన, బాగా డబ్బున్న రియాతో బీహారి అబ్బాయి మాధవ్ ప్రేమలో పడుతాడు. తొలుత తను స్నేహితుడంటూ పరిచయం చేసుకుని తను ప్రేమిస్తున్నట్లు చెపుతాడు. కానీ ఆమె దాన్ని అంగీకరించదు. మరోవైపు మాధవ్‌కు సరిగా ఇంగ్లీషు మాట్లాడటం రాదు. 
 
రియా అనర్గళంగా మాట్లాడుతుంది. వీరి స్నేహం అలా సాగుతున్న సమయంలో రియాను తన ప్రియురాలిగా వుండాలని మాధవ్ ఒత్తిడి చేస్తాడు. అందుకామె అంగీకరించదు. స్నేహితులుగా మాత్రమే ఉండాలని ఆమె అంటుంది. అందుకు అతడు అంగీకరించడు. చివరికి రియా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా వుండేందుకు అంగీకరిస్తుంది. ఇలా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా అంగీకరించిన ఆమె అతడికి ప్రియురాలిగా ఏమయినా ఇస్తుందా..? అసలేం చేసిందన్నది సినిమా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments