Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభకోణంలో ఘోర ప్రమాదం: ప్రభుదేవా కొత్తప్రాజెక్టు సభ్యులు ఇద్దరు మృతి

కుంభకోణంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాకు చెందిన కొత్త సినిమా యూనిట్ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ''యంగ్ మంగ్ చంగ్'' అనే తమిళ సినిమా షూటంగ్ కుంభకో

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:29 IST)
కుంభకోణంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాకు చెందిన కొత్త సినిమా యూనిట్ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ''యంగ్ మంగ్ చంగ్'' అనే తమిళ సినిమా షూటంగ్ కుంభకోణంలో జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, తంగర్‌బచ్చన్, లక్ష్మీమీనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజుల పాటు ఈ సినిమా గ్రూప్ తిరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం తిరువైయారులోని అయ్యారప్పర్ ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు గానూ యూనిట్ సభ్యులంతా బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని వ్యానులో తిరువైయారుకు బయల్దేరారు. అయితే కుంభకోణం-తిరువైయార్ రోడ్డు.. కరుప్పురు గ్రామం, కబిస్థలం సమీపంలో వ్యానును భారీ లోడ్‌తో వచ్చిన లారీ వేగంతో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యూనిట్ సభ్యులు మరణించారు. 
 
విజయ్ కుమార్ (43), డ్రైవర్ ఆరుముగం (53) తీవ్రగాయాలతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకా గాయపడిన సభ్యులను తంజావూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కబిస్థలం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇకపోతే.. ఈ విషయం తెలియగానే బాధితులను తంజావూర్ మెడికల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు ప్రభుదేవా. ఈ దుర్ఘటన ప్రభుదేవా టీమ్‌ని తీవ్రంగా కలిచివేసింది.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments