Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి పరిసరాల్లో 1920 భీమునిపట్నం

డీవీ
సోమవారం, 18 మార్చి 2024 (17:27 IST)
Kancharla Upendra Aparnadevi
కంచర్ల ఉపేంద్ర  అపర్ణాదేవి  హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం  "1920 భీమునిపట్నం".. అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ  చిత్రం చిత్రీకరణ రాజమండ్రి పరిసరాల్లో జరుపుకుంటోంది. ఈ మధ్యనే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ను ప్రాంభించుకుని, అక్కడే పది రోజులపాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం యూనిట్ రాజముండ్రికి వెళ్లి, అక్కడి పరిసరాల్లో హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
ఈ సందర్భంగా  నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, "రాజమండ్రిలో కూడా పది రోజుల పాటు షూటింగ్ జరుపుతాం. . హీరో, హీరోయిన్ల పై గోదావరి నేపథ్యంలో సన్నివేశాలను తీయడం జరుగుతోంది. ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే  ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథానుసారం సంగీతం, ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రాణంగా నిలుస్తాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం  ఓ హైలైట్. రాజముండ్రి తర్వాత విశాఖపట్నం, అరకు, ఊటీలలో కూడా చిత్రీకరణ జరుపుతాం" అని చెప్పారు.
 
దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, "భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణా దేవి కనిపిస్తారు" అని అన్నారు. .
 
హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ అపర్ణాదేవి మాట్లాడుతూ, "అద్భుతమైన పీరియాడికల్ చిత్రంలో నటించే అవకాశం అరుదుగా లభిస్తుంటాయి. ఎందుకంటే అలాంటి కథ, దానిని అదే స్థాయిలో తెరకెక్కించగల దర్శకుడు, రాజీపడకుండా, అభిరుచి కలిగిన నిర్మాత కలయికలోనే ఈ తరహా చిత్రం వస్తుంది. కెరీర్ మొదట్లోనే అలాంటి చిత్రంలో నటించడం మా అదృష్టం అని" చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments