Webdunia - Bharat's app for daily news and videos

Install App

105 మినిట్స్ లో పంచభూతాలకు ఓ అమ్మాయికి మధ్య జరిగే ఆట : దర్శకుడు రాజు దుస్సా

డీవీ
సోమవారం, 22 జనవరి 2024 (11:54 IST)
Raju Dussa - hansika
మాది వరంగల్. సినిమాలు మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా పనిచేశాను. నేను కథలు రాయడం మొదలుపెట్టి డైరెక్షన్ ట్రైల్స్ లో ఉండగా నాకు వచ్చిన సినిమా 105 మినిట్స్ అని దర్శకుడు రాజు దుస్సా అన్నారు. హన్సిక హీరోయిన్ గా బొమ్మక్ శివ నిర్మించిన ఈ  సినిమా ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఎక్స్పరిమెంటల్ చిత్రంగా నిర్మించారు. జనవరి 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భం గా దర్శకుడు రాజు దుస్సా పలు విషయాలు చెప్పారు. 
 
105 మినిట్స్ ఒక కొత్త కాన్సెప్ట్ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది?
కథలు చాలానే వస్తుంటాయి. నేను ఒక సినిమాకి డైలాగ్ వర్షన్ రాస్తున్నప్పుడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ టైం పీరియడ్స్ అలా రాయడం జరిగింది. కానీ ఒకటే క్యారెక్టర్ ని ఒక పర్టికులర్ టైం లో ఒక లెంగ్తి షాట్ తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. రియల్ టైం లో తీయాలనే ఆలోచన వచ్చింది. అలా మొదలైంది ఈ 105 మినిట్స్. కథ తయారు చేసుకున్న తర్వాత చాలామంది వినిపించాను. కానీ అదల మరుగున పడిపోయి లాక్ డౌన్ లో మళ్ళీ బయటికి వచ్చింది. బొమ్మక్ శివ గారికి నాకు మంచి రిలేషన్ ఉండటం ఆయన నేను ఒక కమర్షియల్ సినిమా తీయాలని అనుకున్నాం. కానీ అప్పుడు హీరో డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఈ కథ ని వినిపించడం జరిగింది. కథ చెప్పాను సింగిల్ క్యారెక్టర్ అన్నాను సింగిల్ క్యారెక్టర్ తో రెండున్నర గంటలు ఎలా కూర్చోబెడతావు రాజు అని అడిగారు. కూర్చో పెడతాను మ్యూజిక్ బ్యాగ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ అన్నాను. నేను ఇంతకుముందు ఏం చేశాను అని కూడా అడక్కుండా కథని నన్ను నమ్మారు.
 
ఈ 105 మినిట్స్ టైటిల్ కి జస్టిఫికేషన్ ఏంటి?
ఇది రియల్ టైం లో మీరు అక్కడ కూర్చుని లైవ్ లో మీరు చూస్తే ఎదురుగా జరుగుతుందో అలా అనిపించే కదా. ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్కువ రాలేదు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ 105 మినిట్స్ లో కంప్లీట్ చేసాం.
 
హన్సిక గారిని తీసుకోవడం ఎలా అనిపించింది? సింగిల్ షాట్ కోసం ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా?
హన్సిక గారు మా ప్రాజెక్టు ఒప్పుకోవడం చాలా హ్యాపీ. ఫస్ట్ కథ అనుకున్నప్పుడు సింగిల్ షాట్ అనుకోలేదు. కానీ మా డిఓపి కద విన్నాక ఇది సింగల్ షాట్ లో చేయొచ్చు కదా అని ఐడియా ఇచ్చారు. సింగిల్ షాట్ అనేది నేను వినలేదు కానీ అలాంటిది ఒకటి ఉంది అని దాని గురించి ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి మా డిఓపి కిషోర్ నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసాం. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని స్టోరీ బోర్డ్ చేసుకున్నాం. చేసుకుని స్క్రిప్ట్ వర్క్ స్టోరీ బోర్డు కలిపి హన్సిక గారికి వినిపించాం. వినగానే ఎక్సైట్ అయ్యి యాక్సెప్ట్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది.
 
డెబ్యూ డైరెక్టర్ అయ్యుండి కూడా మంచిగా గారితో చేయడం ఎలా అనిపించింది?
హన్సిక గారు ఎప్పుడు ఏం చేశారు అని కూడా అడగలేదు. కథ నచ్చి క్యారెక్టర్ లో ఎలా చెప్తే అలా చేశారు. హన్సిక గారు ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ. ఒక గ్లామర్ గాలిని రెండో షెడ్ లో చూపిద్దాం అన్న ప్రయత్నం సక్సెస్ అయింది.
 
మీరు ప్రొడ్యూసర్ గారు అనుకున్నట్టుగానే సినిమా కంప్లీట్ అయిందా?
100% సక్సెస్ అయ్యాం. అనుకున్నది అనుకున్నట్టుగానే తీసాం. ఒక గ్లామర్ గర్ల్ ని చాలా డిఫరెంట్ గా చూపించాం. హీరోయిన్ అంటే సాంగ్స్, రొమాన్స్ అని కాకుండా ప్రతి ఫ్రేమ్ లో పెర్ఫార్మన్స్ ఉంటుంది.
 
ఈ సినిమాతో ఆడియన్స్ ని ఎలా కూర్చోబెట్టబోతున్నారు?
ఈ సినిమాలో సాంగ్స్ లేవు ఎంటర్టైన్మెంట్ లేవు డైలాగ్స్ కూడా లేవు. కానీ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. నార్మల్ గా ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఏంటి అనేది కనిపెడతా ఉంటారు. కానీ చాలెంజ్ చేసి చెప్తున్నా నెక్స్ట్ ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ మినిట్ కాదు నెక్స్ట్ సెకండ్ కూడా ఏం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా ఎంజాయ్ చేస్తారు.
 
హన్సిక ఒక క్యారెక్టర్ అయినా వేరే క్యారెక్టర్స్ ఏమైనా కనిపిస్తాయా?
నీడ ఉంటుంది. ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా మెయిన్ టీం ఏంటి అంటే ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆట.
 
ఫైనల్ గా థియేటర్ కి ఆడియన్స్ రావాలంటే మీరు ఏం చెప్తారు?
ఒక కొత్త కాన్సెప్ట్. పాటలు, ఫైట్లు, కామెడీ ఎలా చాలా ఉంటాయి సినిమాల్లో. కానీ అవేం లేకుండా ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా 105 మినిట్స్. స్క్రీన్ ప్లే బేస్ చేసుకుని తీసుకున్న సినిమా ప్రతి ఆడియోను ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments