హ్యాపీ బర్త్‌డే 'ప్రియాంక చోప్రా'

Webdunia
జులై 18న 26 వసంతాలు పూర్తి చేసుకుని 27లోకి అడుగుపెడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు హ్యాపీ బర్త్‌డే విషెష్ చెపుతాం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె నటనతోనే అందలమెక్కిన నటి ప్రియాంకా చోప్రా. కేవలం ఒక ఏడాదిలోనే ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువ అయినాకూడా ఆ చిత్రాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి.

' దోస్తానా' మరియు 'ఫ్యాషన్'లాంటి చిత్రాలు విమర్శకుల నోళ్ళు మూయించిందంటే అతిశయోక్తికాదు. 'దోస్తానా' చిత్రం ద్వారా ఆమె తన గ్లామర్‌ను ఆరబోసింది. అదే 'ఫ్యాషన్'లాంటి చిత్రంతో తన నటనా చాతుర్యంతో తనేంటో నిరూపించుకుంది.

ప్రియాంకా అంటే పడిచచ్చేవాళ్ళు ఎక్కువనే చెప్పాలి. తన నిజజీవితంలో హర్మన్ బావెజాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ తర్వాత ఆ సంబంధం కాస్త బెడిసికొట్టింది. కొద్ది రోజులకే షాహిద్‌తో ఆమెకు సంబంధం అంటగట్టారు. ఇప్పటివరకైతే ఆమె ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. అసలు వీరిమధ్య లవ్ ఎఫైర్ ఉందా లేదా అనేది బాలీవుడ్‌లో చెవులుకొరుక్కుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రస్తుతం తన దృష్టి నటనపైనే అంటోంది ప్రియాంకా చోప్రా.

ప్రియాంకా గొప్పతనం ఏంటంటే ఆమె ఓ నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన నటి కాబట్టి ఆమె మీద ఎన్ని రకాల గాసిప్స్ వస్తున్నాకూడా ఆమెకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె సెట్స్‌లో ఎప్పుడూకూడా, ఎవ్వరితోనూ అతిగా ప్రవర్తించదని, షూటింగ్‌కు సమయానికి వస్తుందని, ఎవ్వరినీ ఇబ్బందికి గురిచెయ్యదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె క్రమశిక్షణను చూసి నిర్మాతలు ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇంతింతై వటుడింతై అన్న చందాన ఆమె తన కెరీర్‌ను నమ్ముకుని ముందుకు దూసుకుపోతోంది. ఆమె నటించిన "కమీనే", "ప్యార్ ఇంపాజిబుల్" మరియు "వాటీజ్ యువర్ రాశి"? చిత్రాలు విడదల కావాల్సి ఉంది. ఈ చిత్రాలు యష్‌రాజ్ ఫిల్మ్స్, అసుతోష్ గోవర్కర్ మరియు విశాల్ భరద్వాజ్‌చే నిర్మించబడిన చిత్రాలు. ఈ చిత్రాల్లో ఆమె నటనలో కొత్తదనం కనపడుతుందని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

Show comments