సత్యదేవ్, డాలీ ధనంజయల‌ 26వ చిత్రం షూటింగ్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (18:15 IST)
Satyadev, Dolly Dhananjaya and others
వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం ధనంజయ కూడా 26వ చిత్రమే. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 
గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సత్య దేవ్, ధనంజయ, నిర్మాతలు కనిపించారు. పోస్టర్‌పై కరెన్సీ నోట్లు కూడా కనిపించడం ఆసక్తికరంగా వుంది.
 
మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: సత్యదేవ్, డాలీ ధనంజయ
సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్, \అడిషినల్ స్క్రీన్ ప్లే: యువ, నిర్మాతలు: బాల సుందరం, దినేష్ సుందరం,  బ్యానర్: ఓల్డ్ టౌన్ పిక్చర్స్,  డీవోపీ: మణికంఠన్ కృష్ణమాచారి, సంగీతం: చరణ్ రాజ్,  ఎడిటర్: అనిల్ క్రిష్,  డైలాగ్స్: మీరాఖ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

విమానంలో ప్రయాణికురాలికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విషాదం... నిరసన

అసత్యాలతో వేసే పిటిషన్లను తిరస్కరించాలి.. ఆర్జించే మాజీ అర్థాంగికి భరణం ఎందకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments