Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధులంటే ఎంతో ముద్దంటోన్న ముమైత్ ఖాన్

Webdunia
కుర్రహీరోలు, నడివయస్సు హీరోలకంటే వృద్ధులంటేనే తనకు ముద్దన్న నిర్ణయానికి ముమైత్ ఖాన్ వచ్చేసింది. విషయం ఏమంటే... ఎప్పటి నుంచో తాను హైదరాబాదులో ఓ ఆశ్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు చెపుతూ వచ్చేది. అదే వృద్ధాశ్రమం. తన నిర్ణయాన్ని ఆమె తన సన్నిహితులతో చెబితే వారు మంచి నిర్ణయమే తీసుకున్నావని అన్నారట.

ప్రస్తుతం నటీనటులలో చాలామంది నటన కాకుండా ఇతరత్రా వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. తాను చేస్తుంది సమాజసేవ అనే నిర్ణయానికి రావడం తనకు మనశ్శాంతిని కల్గిస్తోందని చెప్పింది. బాలీవుడ్‌కు చెందిన నటినైనప్పటికీ తనకు జీవితాన్నిచ్చింది టాలీవుడ్ కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. పనిలోపనిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాధ్యతలు కూడా నిర్వహించనున్నట్లు తెలియజేసింది.

ఇదంతా బాగానే ఉంది. మరి పెళ్లి చేసుకుని ఎప్పుడు స్థిరపడతారని అడిగితే... తనకు 30 ఏళ్లు దాటాక నచ్చినవాడు దొరికితే వెంటనే తాళి కట్టించుకుంటానంటోంది. కోటీశ్వరుడినో, దుబాయ్ షేక్‌నో చేసుకుని ఆ తర్వాత ఒంటరిగా జీవితాన్ని గడపడం ఇష్టం లేదనీ, తాను చెప్పినట్లు వినేవాడు తనకిష్టమైనవాడు అయితే బెటర్ అని మనసులో మాట చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments