Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వో నపుంసకుడివన్న రాఖీ: ప్రాణం తీసుకున్న యువకుడు

Webdunia
" రియాల్టీ షో" ఇప్పుడు టెలివిజన్ నెట్‌వర్క్‌లు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగిస్తున్న "బ్రహ్మాస్త్రా"లు. వాళ్ల వ్యాపారం ప్రజల జీవితాలతో, మనోభావాలతో ఆడుకోవడమే. ఇటువంటి షోలకు వ్యాఖ్యాతలుగా పేరుమోసిన సినీరంగ ప్రముఖులను నియమిస్తారు. ఇది కేవలం వారి టిఆర్‌పి రేటింగ్ పెంచుకోవడం కోసం మాత్రమే.

టిఆర్‌పి- అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. అంటే టీవీ కార్యక్రమాలను ఎంతమంది చూస్తున్నారు లేదా టీవీలో ఏ కార్యక్రమం ఎంత ప్రాచుర్యంలో వుందని తెలియజేసే గణాంకమన్నమాటి. దీనిని టిఆర్‌పి అనే కన్నా పెద్ద "ట్రాప్" అనడమే మేలన్నది విమర్శకుల వాదన. ఈ రియాల్టీ "ట్రాప్"లో పడి ఎంతో మంది తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్న వారు ఉన్నారు. బాగుపడిన వారు కూడా ఉన్నారనుకోండి. కానీ.. ఈ మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నవారే ఎక్కువని చెప్పాలి.

ఇటీవలే ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ ఓ రియాల్టీ షోను నిర్వహించింది. ఈ షోలో పాల్గొన్న లక్ష్మణ్‌ అనే కుర్రాడిని రాఖీ నామర్ద్‌(నపుంసకుడు) అంటూ అభివర్ణించింది. దాంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి మరణానికి రాఖీనే కారణమని, ఆమెను కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్ తల్లి సావిత్రి అహిర్వాల్ డిమాండు చేస్తున్నారు. సినిమాల్లో ఛాన్స్‌లు రావడం లేదనేమో రాఖీ ఇలా బుల్లితెర ప్రేక్షకులను బెంబేలెత్తిస్తోంది.

ఇందంతా సరే.. ఇంతకీ మన సెన్సార్ వాళ్లు ఏం చేస్తున్నారో...? చూస్తుంటే.. ఇటువంటి వ్యాఖ్యలు గమనించడం మానేసి... రాఖీపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

ఈ రియాల్టీ షోలు గత రెండు మూడేళ్లుగానే ప్రాచుర్యంలోకి వచ్చి, భాషా బేధం లేకపోయినా.. కొన్ని బహుల ప్రజాదరణ పొందుతున్నాయి. ఇలాంటి రియాల్టీ షోల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారు చాలానే ఉన్నారు. ఒకరేమో ఫైనల్‌లో విజయం సాధించలేదని, మరొకరేమే.. షోలో అవమానం జరింగిందని.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా సంఘటనలున్నాయి.

అయితే ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని. జీవితంలో దేనినైనా సవాల్‌గా తీసుకొని నిలబడటం తెలియాలి. ముఖ్యంగా ఈ షోలు చిన్న పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని షోలు ద్వేషాన్ని ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని షోలు హింసను ప్రేరేపిస్తున్నాయి. ప్రజల భావాలతో ఆటాడుకునే ఇలాంటి.. రియాల్టీ షోలు అవసరమా...?!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు