Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా విడుదలకాలేదు.. కానీ కార్లు కొనేసిన ఆ డైరక్టర్!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:12 IST)
దర్శకుడిపై అభిమానంతో హీరో డేట్స్‌ ఇవ్వడం మామూలే. ఒక పక్క సినిమాలు లేని వైవిఎస్‌ చౌదరి పరిస్థితి అలానే వుంది. తనతో నటించేందుకు ప్రముఖ హీరోలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో... పవన్‌ కళ్యాణ్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజపై కన్నేశాడు. తనను పెట్టి హీరోగా చేస్తానని తిరిగాడు. పవన్‌ ఇచ్చిన హామీతో హీరోగా ముందుకుసాగాడు. 
 
కాగా, ఇందుకు వపన్‌ కొంత మొత్తాన్ని వైవీఎస్‌కు అందజేశాడు. అసలే రవితేజతో 'నిప్పు'తో చేతులు కాల్చుకున్న చౌదరి తన టాలెంట్‌తో సినిమా చేసి పేరు తెచ్చుకోవాలని చూశాడు. అయితే... అతను తనే నిర్మాతగా 'రేయ్‌' చిత్రాన్ని నిర్మించినట్లు పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. అసలే లాస్‌ వచ్చిన చౌదరి ఎలా సినిమా తీస్తున్నాడని కొందరికి ఆలోచన వచ్చింది. ఎట్టకేలకు పవన్ ఇచ్చిన ఎనర్జీతో సినిమా ఆరంభించాడు. 
 
షూటింగ్‌ పూర్తయింది. ఆడియో విడుదలైంది. కానీ.. రిలీజ్‌ కావడం లేదు. ఈలోగా చౌదరి మినీ కూపర్‌, రేంజ్‌ రోవర్ కారులు కొనేడాడట. ఈ విషయాన్ని పవన్‌కు చేరవేశారు. దీంతో చౌదరిని తన వద్దకు పిలిచి పవన్ క్లాస్‌ తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదిఏమైనా చేయి.. సినిమా విడుదల చేయమని అడిగితే... దాన్ని కొనేవారు లేరంటూ.. చేతులెత్తేశాడని సమాచారం. 
 
ఏవో సాకులు చెప్పి.. ఇదిగో అదిగో అంటున్నాడేకానీ.. ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. దాన్ని డైవర్ట్‌ చేయడానికి సాయి ధరమ్‌ తేజ 'పిల్లా నువ్వులేని జీవితం' అనే రెండో సినిమా చేశాడు. అది కూడా సిద్ధమైంది. మరి హీరో అచ్చు పవన్‌ను పోలినట్లు ఉండడం కూడా బిజినెస్‌కు ఎఫెక్ట్‌ పడుతుందని కొందరు డిస్రిబ్యూటర్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments