Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుణశేఖర్ శాకుంతలం ఆకట్టుకొనేనా ?

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:09 IST)
Dev, samantha
అనిర్వ‌చ‌నీయ‌మైన ప్రేమ‌, భావోద్వేగాల క‌ల‌బోత‌గా రూపొందిన అజ‌రామ‌ర‌మైన పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’ * అందమైన అనుభూతికి లోను చేస్తోన్న‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్ ఇటీవలే వచ్చేసింది.  పుట్ట‌గానే త‌ల్లిదండ్రుల ప్రేమ‌కు దూర‌మ‌య్యాను..మీ ప్రేమ‌కు కూడా దూర‌మైతే.. వంటి సంభాష‌ణ‌లు.. అంత‌కు మించి క‌ళ్లు ఆనందంతో విప్పారే స‌న్నివేశాలు ఇవ‌న్నీ క‌ల‌బోసిన చిత్ర‌మే ‘శాకుంతలం’ అని రిలీజ్ ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసిన‌ట్లు అద్భుతంగా తెర‌కెక్కించారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. 
 
మహాభార‌తంలోని అద్భుత‌మైన ప్రేమ క‌థగా మ‌నం చెప్పుకునే దుష్యంత‌, శ‌కుంత‌ల ప్రేమ‌గాథ‌ను మ‌హా క‌వి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కావ్యంగా రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్‌పై గుణ శేఖ‌ర్ రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్ ‘శాకుంతలం’. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. 
 
అయితే ఈ సినిమా పై ఇంతవరకు బజ్ పెద్దగాలేదు. అల్రెడే పురాణం కథ కనుక పుస్తకాలలో చదివిన కథ, దీనిపై గతంలో వచ్చిన సినిమాలను బేరీజు వేసుకుంటే  శాకుంతలం గ్రాఫిక్స్ లో చూసినా ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ఓ ఒప్పందం ప్రకారం దిల్రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దానితో థియేటర్ సమస్య తీరిపోయింది. కానీ థియేటర్ కు జనాలు వస్తారో రారోనని సందేహం యూనిట్లో నెలకొంది. అందుకు ప్రతిసారి సమంతను ప్రమోషన్లకు తీసుకురావడం జరిగింది. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. కానీ వ్యక్తిగతం ప్రశ్నలు మినహా సినిమా గురించి స్పందన పెద్దగా లేదు. 
 
సహజంగా ట్విస్ట్స్ ఉంటేనే థియేటర్ కు ప్రేక్షకులు వస్తారని, తెలిసిన కథ కాబట్టి అందులోనూ ఇప్పటి జనరేషన్ చూస్తేనే సినిమాకు పెట్టిన పెట్టుబడి వస్తుంది అని  ట్రెడే వర్గాలు తెలిపాయి. కానీ ఈ సినిమాపై బయట బజ్ లేకపోవడంతో పిబిసిటీ ఖర్చులు అయినా వస్తాయో లేదోనని యూనిట్లో నెలకొంది. గతంలో గుంశేఖర్ చేసిన సినిమాల్లో సక్సెస్  రేట్ చాలా తక్కువగా ఉండటం ఇందుకు ఊతం ఇస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments