Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శృంగారం నాన్సెన్స్ కాదు'.. నటించేటపుడు అదుపులోనే ఉంటాం : ఐశ్వర్యారాయ్

'శృంగారమంటే నాన్సెన్స్ కాదు' అని బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ అంటోంది. కథ డిమాండ్ మేరకు.. సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందన్నారు. అయితే, తెరపైన శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు పూర్తి స్థాయి స్పృహతో ఉంట

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (09:03 IST)
'శృంగారమంటే నాన్సెన్స్ కాదు' అని బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ అంటోంది. కథ డిమాండ్ మేరకు.. సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందన్నారు. అయితే, తెరపైన శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు పూర్తి స్థాయి స్పృహతో ఉంటామని, అది కేవలం నటన మాత్రమేనని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో హాటెస్ట్ టాపిక్ 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా. ఆ సినిమాలో నటించిన పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ సీన్లను తొలగించాలని, లేదంటే సినిమాను ఆడనిచ్చేది లేదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఒకవేళ సినిమా విడుదలైనా ఆ థియేటర్లను తగులబెట్టేస్తామనీ బెదిరించింది. ఈ రచ్చ కేంద్ర హోంశాఖ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు చేరింది. 
 
ఇదిలావుంటే... ఈ చిత్రంలో నటించిన ఐశ్వర్యరాయ్ రొమాన్స్‌ సన్నివేశాల్లో ఇరగదీసింది. వయసులో తనకన్నా చిన్నవాడైనా రణ్‌బీర్ కపూర్‌తో రొమాన్స్‌ సీన్లను పండించింది. దీనిపై భారీగానే విమర్శలూ మూటగట్టుకుంది ఐష్. హీరోతో ఆమె రొమాన్స్ ఏకంగా బాలీవుడ్ బిగ్‌బీ కుటుంబంలోనే చిచ్చుపెట్టేసిందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆమె స్పందించాల్సిన పరిస్థితి ఏర్పిడంది. ఈ సారి ఏకంగా ‘శృంగారమంటే నాన్సెన్స్ కాదు’ అంటూ ఘాటుగానే స్పందించింది. సినిమాలో ఆ సీన్లు ఎందుకున్నాయో? ఏమిటో తెలియకుండా వివాదాలు సృష్టిస్తే ఎలా అంటూ కొంచెం కోపంగానే చెప్పింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించిన ప్రేమోన్మాది... పట్టుకుని చితక్కొట్టారు.. (Video)

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments